Ram Charan: ‘నేను, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు.. యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా అవకాశం’

Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. యంగ్ హీరో రోషన్ కథనాయకుడిగా తెరకెక్కిన పీరియాడికల్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ 'ఛాంపియన్'. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్, తన సినీ ప్రయాణానికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా స్టార్ కిడ్స్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తాము యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా అవకాశం ఇచ్చిన ఓ నిర్మాత తమకు అవకాశమిచ్చారని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఛాంపియన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ..'ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నంబర్ 1, అల్లు అర్జున్‌కు గంగోత్రి, మహేష్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత... ఇలా మా అందరికీ తొలి అవకాశాలు ఇచ్చిన వ్యక్తి ఒక్క అశ్వినీ దత్ గారే. మాకు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. కానీ మేం ఎలా నటిస్తామో, ఎలా పర్ఫామ్ చేస్తామో అప్పట్లో ఎవరికీ తెలియదు. అయినా మమ్మల్ని నమ్మి సినిమాలు నిర్మించారు. ఇంతమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దత్తు గారికి, వైజయంతీ మూవీస్‌కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

Ram Charan Praises Aswini Dutt at Champion Event Says Star Kids Got Chances Without Proving Acting

అశ్వినీ దత్ వారసత్వాన్ని ఆయన కుమార్తెలు ప్రియాంక దత్, స్వప్న దత్ అంకితభావంతో ముందుకు తీసుకెళ్తున్నారని కూడా చరణ్ ప్రశంసించారు. ఇలాంటి నిర్మాతలతో పని చేయడం నిజంగా అదృష్టమని అన్నారు. ప్రస్తుతం రోషన్ మేకా కూడా అదే బ్యానర్‌లో ఛాంపియన్ మూవీతో వస్తుండటం ఆనందంగా ఉందని, ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని కోరుకున్నారు.

అలాగే.. ఈ ఈవెంట్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తన అప్‌కమింగ్ మూవీ పెద్ది గురించి కూడా రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. పెద్ది షూటింగ్ సజావుగా జరుగుతోందని, మార్చి 27న సినిమా విడుదల కానుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. దీంతో పెద్ది మూవీ ఆలస్యం అవడం లేదనే రూమర్స్ కు బ్రేక్ పడినట్టు అయింది.

ఇక హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. రోషన్‌ను చిన్నప్పటి నుంచే తెలుసునని, 'ఛాంపియన్' పోస్టర్లలో అతడు హాలీవుడ్ హీరోలా చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడని ప్రశంసించారు. తన రెండో సినిమా 'మగధీర' ఎంతటి ఘన విజయం సాధించిందో, అదే స్థాయిలో రోషన్ రెండో సినిమా 'ఛాంపియన్' కూడా భారీ హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాతో తాను మూడున్నరేళ్ల పాటు ప్రయాణించానని, కథా నేపథ్యం చూస్తే యాక్షన్ ఓరియెంటెడ్ 'లగాన్' తరహా ఫీల్ ఇస్తోందని అన్నారు.

ఇక ఛాంపియన్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనస్వర రాజన్‌పై కూడా రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె ముఖంలో సహజమైన కళ ఉందని, భవిష్యత్తులో పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లు, ప్రముఖ దర్శకుల నుంచి అవకాశాలు తప్పక వస్తాయని అన్నారు. మలయాళీ అయినప్పటికీ ప్రత్యేకంగా తెలుగు నేర్చుకుని స్వయంగా డబ్బింగ్ చెప్పడం నిజంగా అభినందనీయమని కొనియాడారు. మొత్తానికి.. హీరో రామ్ చరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిర్మాత అశ్వినీ దత్ దూరదృష్టిని కొనియాడాతున్నారు.

More from Filmibeat

Read more about: ram charan ashwini dutt roshan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X