వైష్ణవ్ తేజ్ గుట్టు బయటపెట్టిన రాంచరణ్.. అమాయకంగా కనిపిస్తాడు.. కానీ చాలా డేంజర్ అంటూ..
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్‌పై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమా సాధిస్తున్న రికార్డులపై రాంచరణ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..
Recommended Video

అగ్నిపర్వంత బద్దలయ్యేంతగా
పంజా వైష్ణవ్ తేజ్ చూస్తే అమాయకంగా కనిపిస్తాడు. కానీ చాలా డేంజర్. లోపల అగ్నిపర్వతం బద్దలవుతుందా అనేంతగా ఆలోచనలు ఉంటాయి. నాకు, తేజ్‌కు క్లాస్ పీకుతాడు. తప్పకుండా సక్సెస్‌ఫుల్ హీరో అవుతాడు. లోపల అగ్నిపర్వతం ఎగిసిపడే బలమైన సంకల్పం ఉంది అని వైష్ణవ్ తేజ్ పేర్కొన్నారు.

60 కోట్ల కలెక్షన్లతో రికార్డులు
ఉప్పెన సినిమాకు భారీ కలెక్షన్లు వస్తుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తొలి చిత్ర హీరోకు సంబంధించిన రికార్డులను వైష్ణవ్ తేజ్ తన ఉప్పెన సినిమాతో తిరగరాస్తున్నారు. 60 కోట్ల మేర ఇప్పటికే వసూళ్లు సాధించింది. అందుకు కారణం బుచ్చిబాబు అని రాంచరణ్ తెలిపారు.

సుకుమార్ ఆచార్యుడు.. బుచ్చిబాబు శిష్యుడు
బుచ్చిబాబుకు సుకుమార్ ఆచార్యుడు అయితే.. సుకుమార్‌కు బుచ్చిబాబు మంచి స్టూడెంట్ అని నిరూపించుకొన్నారు. గోదావరి జిల్లా వారిని నమ్ముకుంటే ఇలాంటి అద్భుతమైన విజయాలను అందిస్తారనే బుచ్చిబాబుతో మరోసారి స్పష్టమైంది అని రాంచరణ్ పేర్కొన్నారు.

వీలైతే మరోసారి ఉప్పెన చూడండి అంటూ
ఇక ఉప్పెన చిత్రానికి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ దంపతులను, సినిమాటోగ్రాఫర్, ఇతర టెక్నిషియన్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, గోదావరి జిల్లా అభిమానుల వల్లే ఇలాంటి విజయం సాధ్యమైంది. ఉప్పెన సినిమాను మరోమారు చూడాలని ఉంది. వీలైతే అభిమానులు మరోసారి చూడాలంటూ రాంచరణ్ సూచించాడు.


Click it and Unblock the Notifications











