‘ఆచార్య’లో హైలైట్ ఫైట్ ఇదే: ప్రభాస్ సినిమాను తలపించేలా ప్లాన్ చేసిన కొరటాల

మెగాస్టార్ చిరంజీవి - టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఆచార్య'. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా భాగం అవడంతో ఇది మల్టీస్టారర్ మూవీ అయిపోయింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. బ్యాలెన్స్ ఉన్న భాగాన్ని సైతం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో వేసిన టెంపుల్ టౌన్‌ సెట్‌లో రామ్ చరణ్‌పై కీలకమైన భాగాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ బయటికొచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. టెంపుల్ టౌన్‌ సెట్‌లో రామ్ చరణ్‌పై రెయిన్ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు కొరటాల శివ. ఇదే అతడికి ఇంట్రడక్షన్ యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. 'ఆచార్య' సినిమా మొత్తంలోనే ఇది హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు. గతంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి'లో సైతం ఇదే తరహా ఫైట్‌ను తీశారు. దానికి ఎలాంటి స్పందన వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే మాదిరిగా 'ఆచార్య'లో ఈ సీన్‌ను ప్లాన్ చేశాడట కొరటాల. ఇప్పటికే ఈ భారీ యాక్షన్ సీన్ చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తోంది.

Ram Charan Rain Fight Highlight in Acharya

మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటకు విశేషమైన స్పందన వచ్చింది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X