Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
విడుదలకు సిద్దమైన రామ్ చరణ్ సినిమా.. ఈ నెలలోనే..
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RRR సినిమాతో పాటు ఆచార్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఈ రెండు సినిమాల షూటింగ్స్ కూడా తుది దశలోనే ఉన్నాయి. కరోనా తాకిడికి ఆ సినిమాలు విడుదల తేదీలు ఎంతవరకు మారతాయో తెలియదు గాని ఈ నెలాఖరున మాత్రం ఒక సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఆ సినిమా మరేదో కాదు.. రంగస్థలం. తమిళ్ లో డబ్ చేసి ఈ నెలాఖరున 30న సినిమాను తమిళనాడులో భారీగా విడుదల చేయబోతున్నారు. అందుకు సంబంధించిన రిలీజ్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్స్ కూడా గట్టిగానే అందించింది.
పెట్టిన పెట్టుబడికి అన్ని రకాలుగా డబుల్ ప్రాఫిట్స్ అందించిన రంగస్థలం సినిమా నటన పరంగా రామ్ చరణ్ కు ఒక కొత్త అధ్యాయంలా నిలిచింది. ఆ సినిమా ప్రతి ఒక్క నటుడికి కూడా ఒక పాఠంలా మారిపోయింది. డైరెక్టర్ సుకుమార్ స్థాయి కూడా అమాంతంగా పెరిగిపోయింది. అలాంటి సినిమా ఇప్పుడు తమిళ జనాల ముందుకు రానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన రంగస్థలం తమిళ్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. మరి ఇప్పుడు ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.