Game Changer: RC 15 టైటిల్ ఫిక్స్ అయ్యింది.. అదిరిపోయే వీడియోతో సినిమాపై క్లారిటీ!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ విషయంలో మొత్తానికి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. గత కొంతకాలంగా అనేక రకాల టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తానికి టైటిల్ 'గేమ్ చెంజర్' అని క్లారిటీ ఇచ్చేశారు. అలాగే సినిమా ఎలా ఉండబోతుందో కూడా ఒక వీడియోతో వివరణ ఇచ్చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

మొదట అలాంటి టైటిల్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా RC 15కు సంబంధించిన స్పెషల్ అప్డేట్ అయితే ఇచ్చారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఏమిటా అని చాలా రోజులుగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలైతే మొదట సర్కారోడు, సీఈఓ అనే టైటిల్ కూడా అనుకున్నట్లుగా టాక్ అయితే వచ్చింది.

కథకు తగ్గట్టుగా టైటిల్
ఇక మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులు ప్రత్యేకంగా స్పెషల్ వీడియోను విడుదల చేస్తూ రామ్ చరణ్ తేజ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అలాగే టైటిల్ కూడా రివిల్ చేశారు. ఈ సినిమాకు కథకు తగ్గట్టుగా గేమ్ చెంజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట. కరెక్ట్ గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు సరిపోయే విధంగా శంకర్ ఆలోచించి ఈ టైటిల్ ఫైనల్ చేసినట్లుగా అర్థమవుతుంది.
కాన్సెప్ట్ వీడియోలో..
ఇక ఈ సినిమా టైటిల్ ని బట్టి అలాగే వీడియోలో కింగ్ అర్థం వచ్చేలా చూపించారు. అలాగే ఎలక్షన్ గుర్తును కూడా హైలెట్ చేయడంతో సినిమా కాన్సెప్ట్ ఎన్నికలకు సంబంధించిన అంశాలతో హైలైట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక ఎన్నికల అధికారి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు అని ఇదివరకే ఒక లీక్ అయితే వచ్చింది.

పాలిటిక్స్ నేపథ్యంలో..
శంకర్ ఎలాంటి సినిమాను తెరపైకి తీసుకువచ్చినా కూడా అందులో ఏదో ఒక సామాజిక అంశం హైలైట్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ గేమ్ చెంజర్ సినిమాలో కూడా రాజకీయాల్లో ఎలాంటి ఎత్తుగడలు ఉంటాయి. అలాగే ఒక ఎన్నికల అధికారిగా ఉన్న హీరో ఎలాంటి ఛాలెంజ్ ను ఎదుర్కొన్నాడు? ఏ విధంగా పాలిటిక్స్ లో గేమ్స్ చెంజర్ గా నిలిచాడు అనే అంశాలు హైలెట్ కాబోతున్నాయట.

విడుదల ఎప్పుడు
దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న మొట్టమొదటి ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా కోసం ఆయన దాదాపు 200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ కు ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. ఇక కీయరా అద్వానీ, అంజలి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శ్రీకాంత్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.


Click it and Unblock the Notifications











