మెగా అభిమానులకు సర్‌ప్రైజ్.. చిరంజీవి బర్త్ డే కానుక సిద్ధం

తమ అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే చాలు.. రెండు మూడు నెలల ముందు నుంచే సంబరాలు మొదలు పెట్టేస్తారు అభిమానులు. అలాగే స్టార్ హీరోలు సైతం తమ అభిమానుల కోసం పుట్టిన రోజు నాడు ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యం లోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నాడు మెగా అభిమానులను ఫుల్ ఖుషీ చేసేలా ఓ గిఫ్ట్ తో సర్‌ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యారట చిరు తనయుడు రామ్ చరణ్.

మెగాస్టార్ 151 వ సినిమాగా తెరకెక్కుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమా ట్రైలర్ విడుదల చేసేందుకు చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22 వ తేదీని ఫిక్స్ చేశారట చెర్రీ. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. వాళ్లందరినీ సర్‌ప్రైజ్ చేసేలా చిరు బర్త్ డే కానుకగా అబ్బురపరిచే సన్నివేశాలతో సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

Ram Charan Ready To Surprize Mega Fans On Chirus Birthday

ప్రస్తుతం పాండిచ్చేరిలో సైరా షూటింగ్ జరుగుతోంది. సైరా నరసింహా రెడ్డి కథలో అత్యంత కీలకమైన పార్ట్‌ను ఇక్కడ షూట్ చేస్తున్నారు. బ్రిటీష్ అధికారులకు, నరసింహారెడ్డికీ మధ్య జరిగే ఒప్పందాలపై తెరకెక్కే సన్నివేశాలను ఇక్కడి అతి పురాతన భవనాల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేయనున్నారని తెలుస్తోంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. చిత్రంలో చిరు సరసన నయనతార నటిస్తుండగా తమన్నా ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాగే ఈ చిత్రంలో అనుష్క కూడా భాగమైందనే వార్తలు వినిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X