‘గేమ్ ఛేంజర్’ ఫెయిల్ అయ్యింది అందుకే... రామ్ గోపాల్ వర్మ అనాలసిస్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిగా 'గేమ్ ఛేంజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సౌత్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతీయ ప్రధాన ప్రాంతీయ భాషలతో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. రిలీజ్ కు ముందు నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ రిలీజ్ తర్వాత 'గేమ్ ఛేంజర్'పై వచ్చిన రివ్యూలు, ఆడియెన్స్ ఒపీనియన్ అంతా వ్యతిరేకంగా ఉండింది. ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఫైనాన్షియల్ గా మాత్రం హిట్ సాధించలేకపోయింది.

సోషల్ మెసేజ్ తో మిళితమైన ఈ చిత్రం ఎందుకో ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది. రాజకీయాల్లో ఉన్న కొన్ని మలినాలను తుడిచిపెట్టే కోణంలో ఎస్ శంకర్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'గేమ్ ఛేంజర్' చాలా వరకు ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. కొద్ది పాటి ప్రేక్షకులు మాత్రం సందేశాత్మకంగా చిత్రంగా మార్కులు వేశారు. కానీ మెజార్టీ థియేటర్లకు రాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫెయిల్ అయ్యింది.

Ram Charan Recent Film Game Changer Failed at Box Office Here is The Director Ram Gopal Varma Analysis

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రూ.350 నుంచి రూ.420 కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించారు. కానీ రిటర్న్ లో బాక్సాఫీస్ నుంచి మాత్రం రూ. 178 కోట్ల వరకే వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు చెప్పాయి. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యిందని తేల్చేశారు. అయితే.. ఆడియెన్స్ పల్స్ ను కూడా పట్టుకోవడంలో ఎస్ శంకర్ ఫెయిల్ అయ్యారనే టాక్ వినిపించింది. అందుకే 'గేమ్ ఛేంజర్' మూవీ కూడా డిజాస్టర్ అయ్యిందని కొందరు అభిప్రాయపడ్డారు.

కాగా.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా 'గేమ్ ఛేంజర్' ఫెల్యూర్ పై స్పందించారు. ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో పలు కారణాలను, ఆయన వెర్షన్ ను తెలియజేశారు.... శంకర్ చిత్రాలు మాసీవ్ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దానికి తగట్టుగానే కమర్షియల్ గానూ, ఆడియెన్స్ ను గాను తనవైపు తిప్పుకునేందుకు ఓ ప్రధాన అంశం ఆయన చిత్రాల్లో ఉంటుంది. అందువల్లే శంకర్ గత చిత్రాలు పెద్ద ఎత్తున సక్సెస్ సాధించాయి.

Ram Charan Recent Film Game Changer Failed at Box Office Here is The Director Ram Gopal Varma Analysis

ఒక్కడులో... ఒక్క రోజు సీఎం, రోబోలో... మేషిన్ మనిషిని ప్రేమించడం వంటి ప్రైమ్ సబ్జెక్ట్ ఉండటం వంటివి శంకర్ సినిమాలకు మార్క్ అన్నారు. ఆ అంశాలే జనాలను బాగా ఆకట్టుకున్నాయని, కమర్షియల్ గా సక్సెస్ ను సాధించి పెట్టాయన్నారు. కానీ గేమ్ ఛేంజర్ లో అలాంటి ప్రధాన అంశం అంటూ ఏదీ జనాలకు కనిపించకపోయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక 'గేమ్ ఛేంజర్' చిత్రంలో అప్పన్న పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. ఐపీఎస్ గానూ రామ్ చరణ్ ఇరగదీశారు. పొటిటీషియన్ గా ఎస్జే సూర్య అదరగొట్టాడు. కానీ స్క్రీన్ ప్లై, ప్లాట్ పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Read more about: ram charan game changer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X