‘మరక్కార్’ ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్ .. మోహన్ లాల్ యాక్షన్ అదుర్స్
బాహుబలి చిత్రాల తరువాత ప్యాన్ ఇండియాపై అన్ని ఇండస్ట్రీలు మోజు పెంచుకున్నాయి. బాలీవుడ్ సినిమాలు సైతం తెలుగులో గట్టిగా ప్రమోట్ చేస్తూ సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు. కోలీవుడ్, మాలీవుడ్ ఇలా ప్రతీ ఇండస్ట్రీలో ప్యాన్ ఇండియన్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ఆ క్రమంలో వచ్చిన చిత్రాలే థగ్స్ ఆఫ్ హిందూస్తాన్, సైరా, సాహో. అయితే వీటిలో ఏ ఒక్కటి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయలేకపోయాయి.
అయితే ఈసారి మోహన్ లాల్ ప్రయత్నించేందుకు ముందుకు వచ్చాడు. ట్రైలర్ చూస్తుంటే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మాధిరిగానే అనిపిస్తుంది. ఈ ట్రైలర్‌లో మోహన్ లాల్ యాక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. మరి చివరకు ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. అయితే దక్షిణాదికి చెందిన నటీనటులు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశమే.

మరక్కార్ మూవీ ట్రైలర్‌ను తెలుగులో రామ్ చరణ్ విడుదల చేయగా, కన్నడలో రాక్ స్టార్ యశ్, తమిళంలో సూర్య, హిందీలో అక్షయ్ కుమార్ వంటి వారు రిలీజ్ చేశారు. అత్యంత భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించాడు.
marakkar marakkar trailer mohan lal ram charan keerhty suresh akshay kumar suriya మరక్కార్ మోహన్ లాల్ కీర్తీ సురేష్ రామ్ చరణ్ అక్షయ్ కుమార్ సూర్య


Click it and Unblock the Notifications