వరుణ్ తేజ్ కోసం రామ్ చరణ్ వదిలిన న్యూ మూవీ పోస్టర్.. ఉహించినట్లే పవర్ స్టార్ టైటిల్‌తో పంచ్

మెగా హీరోలు అందరు మాస్ ఫ్యాన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటే వరుణ్ తేజ్ మాత్రం వారికంటే కాస్త డిఫరెంట్ గా క్లాస్ ఆడియెన్స్ ను ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక చాలా రోజుల తరువాత ఈ హీరో కాస్త సినిమా షూటింగ్ లతో బిజీ బిజీ అయ్యాడు.. గత కొన్ని రోజుల క్రితం చెల్లి పెళ్లి చేసి బ్రేక్ తీసుకున్న వరుణ్ ఆ పెళ్లి తరువాత మొత్తానికి F3 సినిమాతో సెట్స్ పైకి వచ్చాడు. ఇక నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

PICS: Srilanka Actress Piumi Hansamali Photos goes viral on internet Photos

రామ్ చరణ్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్

రామ్ చరణ్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్

లాక్ డౌన్ కంటే ముందే బాక్సింగ్ నేపథ్యంలో ఒక డిఫరెంట్ సినిమాను సెట్స్ పైకి తెచ్చిన వరుణ్ మళ్ళీ చాలా కాలం తరువాత ఆ సినిమా పనులను కూడా మొదలు పెట్టాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ పై గత వారం నుంచి అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశాడు.

సినిమా కోసం విదేశాలకు వెళ్లి బాక్సింగ్ కోచింగ్

సినిమా కోసం విదేశాలకు వెళ్లి బాక్సింగ్ కోచింగ్

కొత్త దర్శకుడు కిరణ్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమా కోసం వరుణ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ కోచింగ్ తీసుకున్నాడు. పూర్తిగా బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా కెరీర్ లో మరో బిగెస్ట్ హిట్ కొట్టాలని వరుణ్ గట్టిగాక్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

Recommended Video

Varun Tej Recovers And Tests Negative For COVID 19 | Filmibeat Telugu
పవన్ పేరును వాడుతున్న వరుణ్

పవన్ పేరును వాడుతున్న వరుణ్

అయితే మరోసారి వరుణ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ను వాడుకోబోతున్నాడు. ఇదివరకే తొలిప్రేమ టైటిల్ తో హిట్టు కొట్టిన వరుణ్ ఇప్పుడు అదే తరహాలో మరో సినిమాలోని పవన్ క్యారెక్టర్ పేరును టైటిల్ గా సెట్ చేసుకున్నాడు. ఆ మోషన్ పోస్టర్ ను రామ్ చరణ్ వరుణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేశాడు.

గని.. పవర్ఫుల్ పంచ్

గని.. పవర్ఫుల్ పంచ్

ఏ.కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం బాలు. అయితే ఆ సినిమాలో పవన్ 'గని' అని ఒక క్యారెక్టర్ లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ పేరును కొత్త సినిమా టైటిల్ గా సెట్ చేసుకున్నాడు వరుణ్. మోషన్ పోస్టర్ లో వరుణ్ బాక్సర్ గా కనిపిస్తూ పవర్ఫుల్ పంచ్ ఇవ్వడం ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను ఈ ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ఒక ముఖ్యమైమ పాత్రలో నటించనున్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X