చిరంజీవికి రామ్ చరణ్ చెప్పిన ఆ ఒక్క అబద్ధం.. చెర్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా దూసుకుపోతున్నాడు.తన నటనతో మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అతి తర్వలో 'పెద్ది' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌తో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి అనుభవాలు, మెగాస్టార్ చిరంజీవి పెంపకం, కుటుంబంలో ఉన్న క్రమశిక్షణ గురించి చరణ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ఇంట్లో పెరిగినా.. చిన్నప్పుడు తమకు సినిమా ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండేది కాదని చరణ్ తెలిపారు. ఇంట్లో సినిమా చర్చలు జరగడం చాలా అరుదని, అవార్డులు, సినిమా మ్యాగజైన్‌లు కూడా ఇంటికి రాకుండా ఆఫీసులోనే ఉండిపోయేవని చెప్పారు. అంతేకాదు, తండ్రి ఎంత పెద్ద స్టార్ అనే విషయం కూడా చిన్నతనంలో పూర్తిగా అర్థం కాలేదని గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సెట్స్‌కి కూడా చిరంజీవి ప్రత్యేకంగా పిలిస్తేనే వెళ్లేవాళ్లమని, ఆ క్రమశిక్షణే తమను చాలా విషయాల్లో నియంత్రించిందని అన్నారు.

Ram Charan Reveals He Lied to Chiranjeevi About Becoming a Mechanical Engineer

అయితే తనకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ, ఆ విషయాన్ని తండ్రికి చెప్పడానికి చాలా కాలం ధైర్యం చేయలేదని చరణ్ వెల్లడించారు. ఒకసారి 17 ఏళ్ల వయసులో చిరంజీవి తనను పిలిచి, "భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు?" అని ప్రశ్నించారని తెలిపారు. ఆ సమయంలో యాక్టర్ కావాలనే కోరికను చెప్పడానికి భయపడి, తండ్రిని ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో తాను మెకానికల్ ఇంజనీర్ అవుతానని చెప్పానని నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

"నా మనసులో మాత్రం నటుడవ్వాలనే కల ఉండేది. కానీ ఆ విషయం నేరుగా చెప్పలేకపోయాను. తర్వాత చదువు పూర్తయ్యాక సరైన సమయంలో నాన్నే నన్ను నటన వైపు ప్రోత్సహించారు. నటుడిగా కెరీర్ ప్రారంభించమని కూడా నాన్ననే సూచించారు" అని రామ్ చరణ్ వెల్లడించారు. ప్రస్తుతం చరణ్ చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఆయన నిజంగానే మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఉంటే తెలుగు సినీ పరిశ్రమ ఓ స్టార్ హీరోను కోల్పోయేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. తన కలను నమ్ముకుని ముందుకు సాగిన చరణ్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదగడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా'పెద్ది'. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రంపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాదు, బుచ్చిబాబు కూడా 'ఉప్పెన' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కావడంతో సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ చర్చ జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో రామ్ చరణ్ మాస్ అవతార్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ మూమెంట్స్, చరణ్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'పెద్ది' జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read more about: ram charan chiranjeevi peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X