NTR- Ram Charan : ఎన్టీఆర్ అంటే అంత భయమా? రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్‌లో సార్ట్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి వార్తల్లో నిలిచింది. యాక్టింగ్, డ్యాన్స్ ల్లో ఎనర్జీతో 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. అయితే.. తాజాగా తారక్ పై రామ్ చరణ్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్- చరణ్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ స్టార్ హీరోలు RRR సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమ యాక్టింగ్ తో ప్రేక్షకులను గ్లోబల్ ప్రేక్షకులను మెప్పించారు. నిజ జీవితంలోనూ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రల్లో వీరి నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 'నాటు నాటు' పాటతో ఆస్కార్ స్థాయికి చేరిన ఈ జోడీ, గ్లోబల్ మార్కెట్‌లో టాలీవుడ్ పేరు మారుమోగేలా చేసింది.

ఇటీవల రామ్ చరణ్‌కు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్య్వూలో 'మీకు ఒక పవర్‌ఫుల్ కారు ఇచ్చి, మీరు ప్యాసింజర్ సీట్‌లో కూర్చోవాల్సి వస్తే.. ఎవరి డ్రైవింగ్‌పై పూర్తి నమ్మకం ఉంటుంది?' అని ప్రశ్నించగా..చరణ్ ముందుగా "అసలు అలాంటి అవకాశం ఎవరికీ ఇవ్వను" అంటూ నవ్వేశాడు. అయితే వెంటనే, 'కొంతమందితో డ్రైవ్ ఎంజాయ్ చేయొచ్చు... అందులో తారక్ ఒకడు. తారక్ ఒక మ్యాడ్ డ్రైవర్. అతని డ్రైవింగ్ చాలా ఎనర్జీగా, ఇంటెన్స్‌గా ఉంటుంది. అతనితో రైడ్ చేస్తే భయంతో పాటు ఎంజాయ్‌మెంట్ కూడా ఉంటుంది' అంటూ సరదాగా కామెంట్ చేశాడు.
ఈ వ్యాఖ్యలు క్షణాల్లోనే నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు ఎన్టీఆర్‌ను నటుడు, డాన్సర్, సింగర్‌గా మాత్రమే చూసిన అభిమానులు, ఇప్పుడు ఆయన డ్రైవింగ్ స్కిల్స్ గురించీ చర్చ మొదలుపెట్టారు. 'తారక్‌లో ఇంకో టాలెంట్ బయటపడింది'అంటూ ఫ్యాన్స్ ఫన్నీ మీమ్స్‌తో స్పందిస్తున్నారు.
ఇదిలాఉంటే.. ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా ఈ ఇద్దరూ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తుండగా, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'డ్రాగన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాలకూ మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యం ఉండడం విశేషం. ఏది ఏమైనా రామ్ చరణ్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు ఎన్టీఆర్ స్టార్‌డమ్‌తో పాటు వారి స్నేహాన్ని కూడా మరోసారి హైలైట్ చేశాయి. ఈ కామెంట్స్ ను తమ ఫ్యాన్ నెట్టింట్లో తెగ వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











