పెద్దిలో ఆ ఎపిసోడ్ హైలైట్.. ఉప్పెన కంటే 100 రెట్లు ట్విస్ట్: రామ్ చరణ్

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా 'పెద్ది'. ఈ సినిమా ప్రమోషన్స్ రోజురోజుకీ మరింత హీట్ పెంచుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల కావడంతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో, ఇప్పుడు చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో సినిమా హైలెట్స్ గురించి చిన్న చిన్న లీక్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ - బుచ్చిబాబు సాన మధ్య జరిగిన ఓ చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఇంటరాక్షన్‌లో రామ్ చరణ్ 'పెద్ది'లోని "ఢిల్లీ ఎపిసోడ్" గురించి ప్రత్యేకంగా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. "సినిమా మొత్తంలో నాకు అత్యంత ఇష్టమైన భాగం ఢిల్లీ ఎపిసోడ్. అదే ఈ కథకు హార్ట్ లాంటిది" అని చరణ్ చెప్పారు. ఈ ఎపిసోడ్ గురించి ఆయన చెప్పిన వివరాలు మరింత క్యూరియాసిటీ పెంచాయి. "ఎడిటింగ్ రూమ్‌లో ప్రతిసారి ఆ సీన్ చూస్తే ఎంతో ఎక్సైట్ అయ్యేవాడిని. ఒక చిన్న ఫ్రేమ్ కూడా కట్ చేస్తామంటే భయమేసేది" అని బుచ్చిబాబు తెలిపారు. దీంతో ఈ ఎపిసోడ్ ఎంత ఇంపార్టెంట్‌గా తెరకెక్కిందో అర్థమవుతోంది.

Ram Charan Reveals Peddi Delhi Episode Twist 100 times Bigger Than Uppena Shock

ఇదే విషయంపై దర్శకుడు బుచ్చిబాబు కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "ఢిల్లీ ఎపిసోడ్‌లో ఒక్క షాట్ కూడా కట్ చేయకుండా ఎడిట్ చేశాం. ఆ సీన్‌ల ప్రాముఖ్యత అంత ఎక్కువ" అని చెప్పారు. ఎడిటర్ కూడా ప్రతి సారి చరణ్ గుర్తు చేస్తూ, ఈ సీన్స్ కట్ చేయొద్దని చెప్పేవారని వెల్లడించారు. దీంతో ఈ ఎపిసోడ్‌పై టీమ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో స్పష్టమవుతోంది. ఇక రామ్ చరణ్ ఈ ఎపిసోడ్‌ను మరింత హైలైట్ చేస్తూ, సినిమాటోగ్రఫీపై కూడా ప్రశంసలు కురిపించారు. "కెమెరామెన్‌కు 100లో 200 మార్కులు ఇవ్వాలి. ప్రతి షాట్ ఒక హైలెట్" అని అన్నారు. ఈ ఎపిసోడ్‌లోనే సినిమాలోని కీలక ఎమోషనల్ సీన్స్ ఉంటాయని కూడా తెలిపారు.

అయితే అసలు సర్ప్రైజ్ మాత్రం ట్విస్ట్ విషయంలోనే ఉంది. ఈ ఢిల్లీ ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఉప్పెన (Uppena) సినిమాతో పోల్చుతూ, "ఉప్పెనలో ఉన్న ట్విస్ట్ కంటే ఇది 100 రెట్లు షాకింగ్‌గా ఉంటుంది" అని చరణ్ చెప్పడం సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఈ వ్యాఖ్యలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందిస్తూ, "మొదట ఈ కథను చెప్పడానికి కొంచెం భయపడ్డాను. ఒక స్టార్ హీరోకి ఇలా చెప్పడం ఎలా ఉంటుందో అనిపించింది. కానీ ఈ ఎపిసోడ్‌లో హీరోయిజాన్ని 50 రెట్లు పెరుగుతుంది. హీరోయిజాన్ని కూడా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుంది" అని వివరించారు.

ఈ మాటలకు రామ్ చరణ్ కూడా ఏకీభవిస్తూ, "నన్ను కన్విన్స్ చేసిన విధానం అద్భుతం. ఈ ఎపిసోడ్ సినిమా మొత్తం మార్చేస్తుంది" అని అన్నారు. దీంతో ఈ సీక్వెన్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి. మొత్తంగా చూస్తే, 'పెద్ది' సినిమా కేవలం మాస్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్, షాకింగ్ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్‌గా నిలవబోతుందని క్లియర్ అవుతోంది. ఇలా ప్రమోషన్స్‌లో భాగంగా చిన్న చిన్న లీక్స్ ఇస్తూ చిత్ర బృందం హైప్‌ను పెంచుతోంది. ఇక ఈ భారీ ట్విస్ట్ థియేటర్లలో ఎలా రిసీవ్ అవుతుందో, ప్రేక్షకులను ఎంతవరకు షాక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Read more about: buchi babu sana ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X