అందుకే చేతికి కట్టు... పెద్ది ఈవెంట్‌‌లో గాయంపై రామ్ చరణ్ క్లారిటీ..

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ పెద్ది. ఈ ఏడాది టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ మూవీగా పరిగణిస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్‌తో పాటు ఆయన అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే రెండ్రోజుల క్రితం ముంబై పర్యటనలో రామ్ చరణ్ తన కుడిచేతికి కట్టుతో కనిపించడంతో ఆయనకు ఏమైందోనని అంతా టెన్షన్ పడ్డారు. మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. తాజాగా దీనికి చెక్ పెట్టారు రామ్ చరణ్. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
'అర్ధరాత్రి 3 గంటలైనా నాకే ఫోన్.. త్రిషకు నేనంటే ప్రాణం’
'అర్ధరాత్రి 3 గంటలైనా నాకే ఫోన్.. త్రిషకు నేనంటే ప్రాణం’

పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్, బొమన్ ఇరానీ తదితరులు పెద్ది మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

Ram Charan Reveals Real Reason Behind Hand Injury During Peddi Shoot

మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ప్లాన్ చేయడంతో రామ్ చరణ్ కూడా ముంబై చేరుకున్నారు. నగరంలోని సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్‌కు వెళ్లారు చరణ్. అయితే సెలూన్ నుంచి బయటకు వస్తున్న చరణ్ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన కుడిచేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. దీంతో చరణ్‌కు ఏమైందోనని అభిమానులు కంగారుపడుతున్నారు. తాజాగా పెద్ది ఆడియో లాంచ్ ఈవెంట్‌లో చరణ్ ఈ కట్టుపై క్లారిటీ ఇచ్చారు.

Recommended For You
Peddi Trailer Review: పెద్ది మూవీ ట్రైలర్ రివ్యూ
Peddi Trailer Review: పెద్ది మూవీ ట్రైలర్ రివ్యూ

సుల్తాన్, దంగల్ వంటి రెజ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమాలను ఇచ్చిన సల్మాన్ సార్, ఆమీర్‌ సార్‌లకు థ్యాంక్స్. పెద్ది వంటి సినిమాలు చేసేందుకు వాళ్లే ఓ దారి చూపించారు. రెండేళ్లుగా పడిన తన కష్టమంతా బుచ్చిబాబు రాసిన కథ ముందు చిన్నదే. పెద్ది అనే వ్యక్తి తన గుర్తింపు కోసం సాగించే ప్రయాణం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ప్రతి ఒక్కరికీ ఓ గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. పెద్ది సినిమాలో హీరో కూడా అలాంటి వాడే. అతను ఎందుకు అథ్లెట్‌గా మారడో పెద్దిలో చూడొచ్చు.

You May Also Like
నన్ను చంపాలని చేతబడి.. రక్తం వాంతులతో నరకం చూస్తున్నా.. జయం రవి ఆవేదన
నన్ను చంపాలని చేతబడి.. రక్తం వాంతులతో నరకం చూస్తున్నా.. జయం రవి ఆవేదన

జాన్వీకపూర్ మేడం లాంటి శ్రద్ధ ఉన్న వ్యక్తి చూడలేదు. ముంబైలో ఉన్నప్పటికి ప్రతి సీన్‌ను పక్కాగా రిహార్సల్ చేశారు. చివరి రోజు ఓ పాట షూట్ చేస్తే నా కంటే ఆమె బాగా చేశారు. 85 రోజులు నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేయడంతో నాకు టైం లేదు. ఆ సమయంలోనే పాట చేయాల్సి వచ్చింది. సెట్‌లోనే దానిని నేర్చుకుంటూ వచ్చాను. జాన్వీ రిహార్సల్ చేశారో లేదో నాకు తెలియదు. కానీ లాస్ట్ సాంగ్‌లో మాత్రం నా కంటే జాన్వీ 100 రెట్లు బాగా చేశారు. ఆమె ఒక రుస్తం లాంటిది.. జాన్వీ అంకిత భావం, చిత్తశుద్ధి నాకు చాలా ఇష్టం అని రామ్ చరణ్ అన్నారు.

జబర్దస్త్‌లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ? పంచ్‌ల వర్షం ఎప్పటి నుంచి అంటే?
జబర్దస్త్‌లోకి హైపర్ ఆది రీ ఎంట్రీ? పంచ్‌ల వర్షం ఎప్పటి నుంచి అంటే?

మా నాన్నగారు చిరంజీవి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవిలు జగదేకవీరుడు అతిలోక సుందరి, రాణి కాసుల రంగమ్మ తదితర సినిమాలలో కలిసి నటించారు. అందుకే పెద్దిలో జాన్వీతో కలిసి నటించడం చాలా ప్రత్యేకం. మా జోడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. చేతికి అయిన గాయం బుచ్చిబాబు నాకు ఇచ్చిన గిఫ్ట్. గడిచిన 25-30 రోజుల నుంచి కుస్తీ సీన్స్ తీశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులకు బదులు.. నిజమైన పహిల్వాన్లను బుచ్చిబాబు దించాడు. యాక్షన్ అని చెప్పగానే వాళ్లు బలంగా నన్ను పట్టుకున్నారు. దాంతో చేతి మణికట్టు ఎముక విరిగి గాయమైంది. కానీ పెద్దికి సంబంధించి ఇది అందమైన జ్ఞాపకం అని చరణ్ పేర్కొన్నారు.

Read more about: ram charan peddi janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X