అల్లూరి సీతారామరాజు RRR లుక్: హై వోల్టేజ్ లాంటి స్టిల్.. షాక్ ఇచ్చిన రామ్ చరణ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొదటి బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ RRR. ఈ సినిమా కోసం ఇరు వర్గాల.అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. బర్త్ డేకు ఒకరోజు ముందుగానే పోస్టర్ రావడంతో ఆడియెన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

450కోట్ల బడ్జెట్ తో..
జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం దాదాపు 450కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అవసరం అయితే మరింత ఎక్కువ ఖర్చు చేసి సినిమాను రెడీ చెయ్యాలని అనుకుంటున్నారు.

రామ్ చరణ్ పుట్టినరోజు
ఇక శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందే సోషల్ మీడియాలో చెర్రీకి సంబంధించిన ఫొటోలు వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. అభిమానులు బర్త్ డే ఫొటోను ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. ఇక RRR పోస్టర్ విడుదల కావడంతో అది కూడా నిమిషాల్లోనే వైరల్ అయ్యింది.

RRR లుక్ రిలీజ్
బాణం ఎత్తి పట్టుకొని ఉన్న అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ కరెక్ట్ గా సెట్టయినట్లు తెలుస్తోంది. హై విల్టేజ్ ఫీలింగ్ కలిగిస్తున్న ఈ పాత్ర పోస్టర్ లోనే షాక్ ఇచ్చింది అంటే ఇక బిగ్ స్క్రీన్ పై దర్శనమిస్తే రికార్డుల లెక్కలు మామూలుగా ఉండవు. అసలైతే మొదట టీజర్ రానున్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇక ఫైనల్ చిత్ర యూనిట్ కేవలం పోస్టర్ ను మాత్రమేక్ వదిలింది. ఇక సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆచార్య టీమ్ నుంచి కూడా
ఇక శనివారం ఆచార్య టీమ్ నుంచి కూడా సర్ ప్రైజ్ రానుంది. రానున్న రోజుల్లో మెగా హీరోల నుంచి బ్యాప్ టూ బ్యాక్ అప్డేట్స్ రాబోతున్నట్లు అర్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ కు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఈ నెల 29న విడుదల చేయబోతున్నారు. అయితే ఆ టీజర్ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నాను అంటూ రామ్ చరణ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











