twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR Ram Charan Poster: మరో హై వోల్టేజ్ లుక్.. అల్లూరి సీతారామరాజు పవర్ఫుల్ గర్జన!

    |

    సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR టాప్ లిస్టులో ఉంది అని చెప్పవచ్చు. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఎంతో మంది ప్రముఖులు ఈ సినిమా తప్పకుండా పాన్ ఇండియా మార్కెట్ స్థాయిని అమాంతం పెంచేస్తుంది అని అనుకుంటున్నారు. ఇక చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్ విషయంలో అయితే అంతకుమించి అనేలా హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. బుధవారం ఉదయం సినిమాకు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ విడుదల చేయగా సాయంత్రం రామ్ చరణ్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు.

    మెగా నందమూరి మల్టీస్టారర్

    మెగా నందమూరి మల్టీస్టారర్

    RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. మెగా నందమూరి కలయికలో వస్తున్న మొట్టమొదటి మల్టీ స్టారర్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది.

     ఉదయం ఎన్టీఆర్ పోస్టర్

    ఉదయం ఎన్టీఆర్ పోస్టర్

    ఇక సినిమాపై అంచనాలు మరింత పెరిగే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. అంతకంటే ముందు పోస్టర్స్ ద్వారా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పోస్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ పవర్ ఫుల్ గా కనిపించాడు.

    రామ్ చరణ్ లుక్

    రామ్ చరణ్ లుక్

    ఇక రామ్ చరణ్ తేజ్ కూడా హై ఓల్టేజ్ పాత్రల్లోనే దర్శనం ఇవ్వబోతున్నట్లు మరోసారి రుజువు చేశారు. అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన పోస్టర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. పోస్టర్ లో అయితే చరణ్ హై వోల్టేజ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక సినిమాలో పాత్ర పవర్ఫుల్ గా ఉంటుంది అనేలా పోస్టర్ ద్వారా ఋజువు చేశారు. రామ్ చరణ్ తేజ్ సోషల్ మీడియాలో కూడా పోస్టర్ ను విడుదల చేయగా ఆ పోస్టర్ నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    అన్ని భాషల్లో ఒకేసారి

    అన్ని భాషల్లో ఒకేసారి

    ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల చేస్తారా లేదా అనే విషయంపై కూడా చిత్రం మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. తప్పకుండా ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్స్ లో కూడా పేర్కొన్నారు. అసలైతే సినిమా ట్రైలర్ ఈనెల మూడవ తేదీన అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల 9 వ తారీకు వాయిదా వేయాల్సి వచ్చింది.

    Recommended Video

    RRR : That's Ram, Bheem | RRR Latest Posters || Filmibeat Telugu
    ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా?

    ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడేనా?

    ఇక ట్రైలర్ కంటే ముందే చిత్ర యూనిట్ పోస్టర్స్ ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దుబాయ్ లో మొదట భారీగా వేడుకను నిర్వహించాలని నిర్మాత డివివి దానయ్య ఆలోచించారట. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా మళ్ళీ వాయిదా వేసే అవకాశం ఉండవచ్చని అనిపిస్తోంది.

    English summary
    Ram charan rrr movie new poster viral in social media,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X