‘రామ్ చరణ్‌కు ఆ అటిట్యూడ్ మీ నుంచి వచ్చిందే’.. చిరంజీవికి బుచ్చిబాబు ఎమోషనల్ రిప్లై
Chiranjeevi- Peddi: పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ 'పెద్ది'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఇప్పటికే భారీ అంచనాలు సృష్టించింది. గ్రామీణ నేపథ్యంతో మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామా మేళవింపుతో రూపొందుతుంది. దీంతో ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. తాజాగా విడుదలైన రెండో సింగిల్ 'రై రై రారా' పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి, సినిమా క్రేజ్‌ను మరింత పెంచింది. ఈ క్రమంలో చిరంజీవి ట్విట్ కు బుచ్చిబాబు ఇచ్చిన ఎమోషనల్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమన్నారంటే?
పెద్ది మూవీలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'చికిరి' సాంగ్ మిలియన్ల వ్యూస్ సాధించి ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు 'రై రై రారా' అదే రేంజ్‌లో వైరల్ అవుతోంది. 'పెద్ది' చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఉర్రూతలూగిస్తున్న 'రై రై రారా'
ఈ పాటను ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచారు. అలాగే.. ఈ పవర్‌ఫుల్ డ్యాన్స్ నంబర్‌ను ఆయనే స్వయంగా ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం మాస్ ఎనర్జీకి తగ్గట్టుగా ఉండగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ సాంగ్‌ను విజువల్ ఫీస్ట్‌గా మార్చింది. భారీ సెటప్, వందలాది డ్యాన్సర్ల మధ్య రామ్ చరణ్ చేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. ఫాస్ట్ బీట్, పల్సేటింగ్ రిథమ్‌తో సాగే ఈ పాట స్టార్ ఎంట్రీ సాంగ్‌లకు కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
'పెద్ది'పై చిరంజీవి ప్రశంసలు
'పెద్ది'లోని 'రై రై రా రా' పాటపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురించారు. సోషల్ మీడియాలో చిరంంజీవి స్పందిస్తూ.. 'చరణ్ ఎనర్జీ, గ్రేస్ వేరే లెవెల్. అతన్ని చూస్తే గర్వంగా ఉంది' అంటూ కొనియాడారు. ఈ సాంగ్ విజయంలో కీలక పాత్ర పోషించిన టెక్నికల్ టీమ్‌పై కూడా చిరంజీవి ప్రశంసలు కురిపించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా పిక్చరైజేషన్, ఏఆర్ రెహ్మాన్ మ్యాజికల్ మ్యూజిక్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ, రత్నవేలు సినిమాటోగ్రఫీ, అనంత శ్రీరామ్ లిరిక్స్ అన్నీ పవర్‌ప్యాక్డ్‌గా ఉన్నాయని ప్రశంసించారు.నిర్మాత వెంకట్ సతీష్ కిలారు చూపించిన విజన్‌ను కూడా మెగాస్టార్ మెచ్చుకున్నారు.
జ్వరంలోనూ చరణ్ డెడికేషన్
ఈ ట్వీట్‌కు బుచ్చిబాబు ఇచ్చిన ఎమోషనల్ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. షూటింగ్ రోజున రామ్ చరణ్‌కు తీవ్ర జ్వరం ఉన్నప్పటికీ షూటింగ్ ఆపకుండా డ్యాన్స్ చేశారు. 'మేము షూటింగ్ ఆపేద్దామన్నా, ఆయన 'లేదు చేద్దాం' అన్నారు. అంత జ్వరంలో కూడా చిరునవ్వుతో.. పూర్తి ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ అటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సర్' అంటూ మెగాస్టార్ చిరంజీవికి రిప్లై ఇచ్చారు బుచ్చిబాబు. దీంతో చరణ్ ప్రొఫెషనలిజంపై అభిమానులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











