రామ్ చరణ్ బాడీగార్డ్‌కు మెగా ఫ్యాన్స్ చుక్కలు.. ఆన్ డ్యూటీలో కెవిన్‌తో అలా..

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా మెగా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు చిరు. డ్యాన్సులు, ఫైట్స్, నటన ఇలా అన్ని అంశాల్లో తండ్రిని మించిన తనయుడని నిరూపించుకున్నారు చెర్రీ. ఇక తాజాగా విడుదలైన పెద్దిలో రామ్ చరణ్ నటన.. న భూతో అన్న విధంగా ఉందని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించారని... ఆయన నటన వేరే లెవెల్ అంటూ ప్రేక్షకులు కూడా రివ్యూలు ఇస్తున్నారు.

Also Read
Hai Jawani Toh Ishq Hona Hai Day 1 Collections: హై జవానీ తో ఇష్క్ హోనా హై కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే?
Hai Jawani Toh Ishq Hona Hai Day 1 Collections: హై జవానీ తో ఇష్క్ హోనా హై కలెక్షన్స్.. తొలిరోజు ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చరణ్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. ఇక ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు చెర్రీ. ఆయనను చూసేందుకు ఎక్కడికి వెళ్లినా సరే అభిమానులు పోటెత్తుతారు. తనను రక్షించుకోవడం కోసంతో పాటు కుటుంబానికి రక్షణ నిమిత్తం రామ్ చరణ్ వ్యక్తిగతంగా బాడీగార్డులను, సిబ్బంది నియమించుకున్నారు. వీరి 24 గంటలూ చరణ్‌కు భద్రత కల్పిస్తారు. అయితే ఇటీవలి కాలంలో చరణ్ వెనుక ఓ ఆఫ్రికా దేశానికి చెందిన ఆజానుబాహుడు కనిపించడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది.

Ram Charan s Bodyguard Kevin Kunta Faces New Challenge as Fans Crowd for Selfies

అన్ని విషయాల్లో వినూత్నంగా ఆలోచిస్తూ తన మార్క్ చూపిస్తారు రామ్ చరణ్. తన ప్రైవేట్ సెక్యూరిటీ విషయంలోనూ ఆయన ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల పెద్ది సినిమా ముంబై, బెంగళూరు, ఢిల్లీ, భోపాల్, చెన్నై, విజయవాడ సహా పలు నగరాల్లో జరిగిన ఈవెంట్స్‌లో చరణ్ పాల్గొన్నారు. పెద్ది ప్రమోషన్స్ సందర్భంగా తనకు భద్రతా కల్పించేందుకు ప్రత్యేకంగా బాడీగార్డ్‌ను అపాయింట్ చేసుకున్నారు రామ్ చరణ్. తొలుత ముంబైలో జరిగిన పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఇతను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా ఆ వ్యక్తి గురించి కవరేజీ ఇవ్వడంతో పాటు నెటిజన్లు సహజంగానే ఆసక్తి చూపించారు.

Recommended For You
త్రిషా కృష్ణన్‌కు బిగ్‌షాక్? విజయ్ పార్టీ అభ్యర్ధిగా రాఘవ లారెన్స్?
త్రిషా కృష్ణన్‌కు బిగ్‌షాక్? విజయ్ పార్టీ అభ్యర్ధిగా రాఘవ లారెన్స్?

చరణ్ బాడీ గార్డ్ పేరు.. కెవిన్ కుంట. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ అసలు పేరు అబ్డౌ సోవే. బాడీ గార్డ్‌గా మారకముందు బాక్సర్‌గా, రెజ్లర్‌గా సత్తా చాటాడు కెవిన్. అనంతరం ఎమ్ఎమ్ఏ ఫైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటలీలో జరిగిన మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా నిలిచాడు. అనంతరం బాడీగార్డ్‌గా మారాడు కెవిన్. సెలబ్రిటీలు, ఇంటర్నేషనల్ రేంజ్ వీఐపీలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించే ప్రొఫెషనల్ బాడీగార్డ్‌గా ఇతనికి భారీ డిమాండ్ ఉంది. ఇందుకుగాను భారీగా ఛార్జ్ చేస్తాడు కెవిన్. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి రామ్ చరణ్‌ ఇతనికి రోజుకు 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల రేంజ్‌లో శాలరీ పే చేస్తున్నాడట.

You May Also Like
'రక్తం కారుతున్నా నాతో ఆ సీన్... హీరో, హీరోయిన్లవే ప్రాణాలా’
'రక్తం కారుతున్నా నాతో ఆ సీన్... హీరో, హీరోయిన్లవే ప్రాణాలా’

ఇక ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కెవిన్ గురించి యాంకర్ అడగ్గా.. మీడియా అతనిని ఫేమస్ చేసేసింది. ఎవరైనా చాక్లెట్, బిస్కెట్ ఇస్తే అతను నా పర్సనల్ విషయాలు చెప్పేస్తాడేమోనని భయంగా ఉందని సెటైర్ వేశాడు చరణ్. ఫ్యామిలీ, పిల్లలతో కలిసి ఎప్పుడు బయటికి వెళ్లినా అతను గత నాలుగేళ్లుగా మాకు తోడుగా ఉంటున్నాడని రామ్ చరణ్ తెలిపారు. అయితే ఇదంతా ఒక ఎత్తయితే .. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోకి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్ కావడంతో కెవిన్ కూడా సెలబ్రెటీగా మారిపోయాడు.

రోడ్డుపై కారు వదిలేసి పరిగెత్తిన సుమ కనకాల.. స్టార్ యాంకర్‌కు చేదు అనుభవం..
రోడ్డుపై కారు వదిలేసి పరిగెత్తిన సుమ కనకాల.. స్టార్ యాంకర్‌కు చేదు అనుభవం..

రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇతనిని దీ బీస్ట్ అంటూ ట్యాగ్‌లు ఇచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ పేరు, పాపులారిటీ కెవిన్‌కు ఇబ్బందిగా మారుతోంది. కెవిన్‌తో ఫోటోలు దిగేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడుతుండటంతో అతని విధులకు ఆటంకంగా మారుతోంది. సెల్ఫీల కోసం కెవిన్‌ను పక్కకి లాగేస్తుండటంతో చాలా కష్టంగా డ్యూటీ చేస్తున్నాడు కెవిన్. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో పాపులారిటీతో కెవిన్ ఇబ్బందులు పడుతున్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Read more about: ram chara kevin
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X