వినయ విధేయలో అదే టాప్ అట.. బోయపాటి కెరీర్‌లోనే హైలెట్.. ఇక గూస్‌బంప్సే..

Recommended Video

VVR Movie : Ram Charan Talks About His Effort | Filmibeat Telugu

2019 సంక్రాంతి రేసు మరీ రంజుగా కనిపిస్తున్నది. ఈ ఏడాది నాలుగు భారీ బడ్జెట్ చిత్రాలు బరిలోకి దిగాయి. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో వినయ విధేయ రామ, సూపర్‌స్టార్ రజనీకాంత్ పేటా, విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో ఎఫ్2 చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. అయితే ఈ నాలుగు చిత్రాల్లో వినయ విధేయ రామకు మాస్, యూత్‌తో భారీ క్రేజ్ కనిపిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అంశాలు మీడియాలో ఆసక్తిగా మారాయి.

 యాక్షన్ సీన్లే టాప్

యాక్షన్ సీన్లే టాప్

వినయ విధేయ రామ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్లు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అజర్ బైజాన్‌లో షూట్ చేసిన ఫైట్ సినిమాకు హైలెట్‌ అనే మాట బలంగా వినిపిస్తున్నది. ఈ ఫైట్‌తో సినిమా ఓ రేంజ్‌కు వెళ్తుందనే టాక్ సినీ వర్గాల్లో నానుతున్నది. రాంబో గెటప్‌లో రాంచరణ్ పిక్ ఇప్పటికే వైరల్‌గా మారింది.

అజర్ బైజాన్‌లో టాప్ ఫైట్

అజర్ బైజాన్‌లో టాప్ ఫైట్

వినయ విధేయ రామ చిత్రంలోని కీలక ఫైట్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను చాలా సీరియస్‌గా తీసుకొని చిత్రీకరించాడు. అజర్ బైజాన్‌లో భారీ క్రేన్లు, డ్రోన్లు, ఇతర అత్యున్నత సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఈ ఫైట్‌ను బోయపాటి పూర్తి చేశాడు. రోమాలు నిక్కబొడిచే విధంగా ఉండే ఈ ఫైట్ బోయపాటి కెరీర్‌లోనే హైలెట్ అని చెప్పుకొంటున్నారు.

 రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్

రికార్డుస్థాయిలో ప్రీ రిలీజ్

వినయ విధేయ రామ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దాదాపు అన్ని హక్కులను కలుపుకొని రూ.120 కోట్లకుపైగా బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. థియేట్రికల్ హక్కులే రూ.95 కోట్ల వరకు జరగడం గమనార్హం.

రంగస్థలం మూవీ తర్వాత

రంగస్థలం మూవీ తర్వాత

వినయ విధేయ రామ సినిమాకు ముందు వచ్చిన రంగస్థలం సినిమా నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. దాంతో మార్కెట్‌లో రాంచరణ్ బాక్సాఫీస్ స్టామినా మరింత పెరిగింది. అంతేకాకుండా పక్కా మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తుండటంతో అన్ని వర్గాల దృష్టి ఈ సినిమాపై పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X