రామ్ చరణ్ చేతికి గాయం? చేతికి కట్టుతో మెగా పవర్‌స్టార్, ఆందోళనలో ఫ్యాన్స్
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ తర్వాత రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన దశలో తన వీరాభిమాని బుచ్చిబాబు సానాకు అవకాశం కల్పించారు రామ్ చరణ్. చెర్రీ గ్రీన్ సిగ్నల్ కోసం కొన్నాళ్లుగా వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు.. పెద్ది షూటింగ్‌ను పరుగులు పెట్టించాడు. ఎన్నో వ్యయ ప్రయాసలు, వాయిదాల మధ్య జూన్ 4న పెద్ది సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు పెద్ది మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

జూన్ 4న విడుదల నేపథ్యంలో పెద్ది టీమ్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ఈవెంట్స్‌కి ప్లాన్ చేయడంతో పాటు జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుంది. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే ముంబై చేరుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ముంబై చేరుకున్నారు. నగరంలోని సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ హకీం ఆలిం సెలూన్‌కు వెళ్లారు చరణ్.
అయితే సెలూన్ నుంచి బయటకు వస్తున్న చరణ్ ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఆయన కుడిచేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) ఉంది. దీంతో చరణ్‌కు ఏమైందోనని అభిమానులు కంగారుపడుతున్నారు. పెద్ది షూటింగ్‌లో రామ్ చరణ్ చేతికి స్వల్ప గాయమైందని... దాని నుంచి త్వరగా కోలుకోవడానికి ఈ బ్యాండేజ్ ధరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. త్వరలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ సహా పలు ప్రమోషనల్ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఆయన గాయం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. చరణ్ త్వరగా గాయం నుంచి కోలుకోవాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాగా.. పెద్ది షూటింగ్ సమయంలో ఇప్పటికే రామ్ చరణ్ కంటికి గాయమైన సంగతి తెలిసిందే. షూటింగ్‌లో భాగంగా కంటికి దెబ్బ తగలడంతో చరణ్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చిన్న సర్జరీ అనంతరం విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొని వృత్తిపై తన డెడికేషన్‌ను చాటి చెప్పారు చరణ్. ఇదే కాదు.. పెద్ది సినిమా మొదలైనప్పటి నుంచి రామ్ చరణ్ పలుమార్లు గాయాల బారినపడ్డారు. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు.. చికిరి చికిరి పాట షూటింగ్ సమయంలోనూ చరణ్‌కు గాయాలయ్యాయి. అయినప్పటికీ షూటింగ్‌లో పాల్గొని తన నిబద్ధతను చాటుకున్నారు చరణ్.


Click it and Unblock the Notifications


