చిరంజీవిని మరిపిస్తున్న రామ్ చరణ్.. ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా చరిత్ర లోనే ఆయనది ఓ ప్రత్యేక స్థానం. దశాబ్దాల కాలంగా ప్రేక్షక లోకాన్ని అలరిస్తూ ఇప్పటికే 150 సినిమాలు చేసిన ఆయన ఇంకా తన ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పెట్టలేదు. నేటి తరం ఆడియన్స్‌ని సైతం మెప్పించేలా ఆయన ఎప్పటికప్పుడు మోడిఫై అవుతుండటం విశేషం. అయితే ఎప్పటి నుంచో గెటప్పుల పరంగా చిరంజీవి స్టయిలే వేరు. అప్పటి సినిమాల్లో ఆయన వేసిన కొన్ని గెటప్స్ నేటికీ షైన్ అవుతూనే ఉన్నాయి. అందులోంచి ఓ గెటప్ తీసుకొని ఇమిటేట్ చేశాడు మెగా తనయుడు రామ్ చరణ్. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

ఆఫ్రికాలో చెర్రీ ఉపాసన
జూన్ 14న తమ ఏడో వివాహ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ముందుగానే చెర్రీ విహార యాత్ర ప్లాన్ చేశాడు. ఈ మేరకు తన భార్య ఉపాసనతో ఆఫ్రికా చేరుకొని తెగ ఎంజాయ్ చేసేశాడు. జూన్ 14 నాటికి రామ్ చరణ్ తన ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉన్నందున కాస్త ముందుగానే మ్యారేజ్ డే వెకేషన్ పెట్టుకున్నారు చెర్రీ, ఉపాసన.

టాంజానియాలో నాలుగు రోజుల పాటు
ఆఫ్రికా టూర్‌లో భాగంగా వీరిద్దరూ టాంజానియాలో నాలుగు రోజుల పాటు పర్యటించారు.
అక్కడి సెరెంగెటి నేషనల్ పార్క్‌లో వన్య ప్రాణులతో సరదాగా గడుపుతూ సఫారీని ఎంజాయ్ చేశారు. ఇదే నేషనల్ పార్క్‌లోని సెరొనెరాలో ఉన్న వన్ నేచర్ హోటల్‌లో వీరు నాలుగు రోజుల పాటు ఉండి వారి సేవలందుకున్నారు. ఈ మేరకు హోటల్ వారికి కృతజ్ఞతలు చెబుతూ ఆ హోటల్ లో దిగిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన.

కవ్ బాయ్ గెటప్‌లో చరణ్
తాజాగా ఉపాసన షేర్ చేసిన ఈ ఫొటోల్లో రామ్ చరణ్ యమ స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చాడు. రౌండ్ హ్యాట్ పెట్టుకుని కవ్ బాయ్‌లా కనిపించాడు చెర్రీ. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లుక్ లో రామ్ చరణ్.. తండ్రి చిరంజీవిని మరిపించేలా ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

కొదమ సింహంలో చిరు
అప్పట్లో వచ్చిన 'కొదమ సింహం' సినిమాలో చిరు ఎలా ఉన్నారో.. ఈ గెటప్ లో అచ్చం అలాగే ఉన్నాడు రామ్ చరణ్. ఆ రోజుల్లో చిరు వేసిన ఈ గెటప్ చాలా ఫేమస్ అయింది. దీంతో నేటి చెర్రీ గెటప్‌ని 'కొదమ సింహం' సినిమాలో చిరు గెటప్‌తో పోల్చుతూ చిరుని మరిపించేలా చెర్రీ గెటప్ ఉందని అంటున్నారు నెటిజన్లు.

ఆర్ఆర్ఆర్‌లో జాయిన్
మరికొద్ది రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు రామ్ చరణ్. గాయం కారణంగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని.. ఆ తర్వాత ఆఫ్రికా టూర్ వేసిన చెర్రీ ఇక ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఫుల్ యాక్టీవ్ కానున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ భారీ మూవీలో చెర్రీ సరసన ఆలియా భట్ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











