twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాంచరణ్ లుక్ కేక.. వినయ విధేయ రామలో రాముడిగా.. ఫొటో వైరల్

    |

    Recommended Video

    Ram Charan's Look In Vinaya Vidheya Rama Goes Viral | Filmibeat Telugu

    మెగా పవర్ స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న వినయ విధేయ రామ చిత్రంపై రోజు రోజుకు భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు అభిమానుల్లో క్రేజీని పెంచుతున్నాయి. చిత్రంలోని రాంచరణ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నది. వివరాల్లోకి వెళితే..

    వినయ విధేయ రామ చిత్రంలో

    వినయ విధేయ రామ చిత్రంలో

    ఇటీవల ఫ్యాన్స్ అత్యుత్సాహంతో తమ అభిమాన హీరోల ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రాంచరణ్ ఫోటో ఇంతకీ వినయ విధేయ రామ సినిమాల్లోనిదేనా అనే ప్రశ్న తలెత్తింది.

    రాంచరణ్ లుక్ కేక

    ఎందుకంటే శ్రీరామచంద్రుడు అవతారంలో కనిపించిన రాంచరణ్ లుక్ కేక పెట్టించేలా ఉంది. ఒకవేళ వినయ విధేయ రామ చిత్రంలోనిదే అయితే ఇక మెగా ఫ్యాన్స్‌కు పండుగే అనే మాట వినిపిస్తున్నది. ఇలా ఎందుకు రాముడిగా కనిపించాల్సి వచ్చిందనే విషయం చర్చనీయాంశమైంది.

    బీహార్ మాఫియా గ్యాంగ్ నేపథ్యంగా

    బీహార్ మాఫియా గ్యాంగ్ నేపథ్యంగా

    పగ, ప్రతీకారం అంశాలతో వినియ విధేయ రామ తెరకెక్కినట్టు టీజర్, ట్రైలర్లలో స్పష్టమైంది. విలన్‌పై కొణిదెల రాంచరణ్ అంటూ రాంచరణ్ చేసే కామెంట్లు ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించాయి. బీహార్ బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమా రూపొందినట్టు వార్తలు వస్తున్నాయి.

     జనవరి 11న విడుదల

    జనవరి 11న విడుదల

    వినయ విధేయ రామ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి యువ హీరో, హీరోయిన్లు ఆర్యన్ రాజేష్, ప్రశాంత్, స్నేహ కీలక పాత్రల్లో కనిపిస్తారు. భరత్ అనే నేను ఫేమ్ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నది. డీవీవీ ఎంటర్‌టైనర్‌మెంట్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ కానున్నది.

    English summary
    The second single, Thassadiyya from Ram Charan & Boyapati Srinu's 'Vinaya Vidheya Rama' will be out tomorrow at 4 pm. This movie is all set to Release in January 2019. Devi Sri Prasad is the music Director. DVV Danaiah as producer, Boyapati Srinu is the director for the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X