Chiranjeevi Review on Peddi Trailer: పెద్ది ట్రైలర్‌పై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

బుచ్చిబాబు సానా దర్వకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన మూవీ పెద్ది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. పీరియాడికల్ మూవీగా రూరల్ డ్రామా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దాంతో పెద్ది కోసం మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు పెద్ది మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

Ram Charan s Peddi Trailer Review by Chiranjeevi Goes Viral Mega Fans Excited

రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మే 18వ తేదీన పెద్ది ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ముంబైలో జరగనున్న ఈ కార్యక్రంలో పాల్గొనేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడికి చేరుకుంది. పెద్ది నుంచి చాలా వరకు వరకు ఎలాంటి అప్‌డేట్ లేకపోవడంతో అభిమానులు కూడా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ ద్వారా పెద్దిపై హైప్ క్రియేట్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

పెద్ది ట్రైలర్ చూశాను.. వావ్! 3 నిమిషాలు ప్యూర్ ఫైర్ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్ ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు. ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్ అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. అన్నట్లు.. చాలా రోజులయ్యింది మీకు చిరు లీక్స్ ఇచ్చి 'మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సార్' అంటూ పెద్దిలోని ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ను చిరంజీవి లీక్ చేశారు. సారీ బుచ్చిబాబు.. చూసాక కంట్రోల్ తప్పానంటూ డైలాగ్ లీక్ చేసినందుకు సారీ చెప్పారు మెగాస్టార్. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతుండగా.. ఆయన రివ్యూతో పెద్ది సినిమాలపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

కాగా.. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా పలు నగరాలలో పెద్ది టీమ్ పలు ఈవెంట్స్‌లో పాల్గొననుంది. వీటిలో ఒక కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతారని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అనంతరం జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్‌బీ స్టేడియంలో దీనికి వేదిక కానుందని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావడంతో పెద్ది యూనిట్.. ప్రమోషన్‌ను పరుగులు పెట్టించేందుకు భారీ ప్లానింగ్‌తో ఉంది. దీనికి చిరంజీవి ఆశీస్సులు తోడు కావడంతో యూనిట్ రెచ్చిపోవడమే.

Read more about: ram charan peddi chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X