విడుదలకు సిద్ధమైన రామ్ చరణ్ మూవీ: రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రంగస్థలం'. 1985 కాలం నాటి గ్రామీణ కథతో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా ఇది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే సమయంలో నటుడిగా రామ్ చరణ్‌కు మంచి పేరును సైతం తీసుకు వచ్చింది. ఇంతటి గొప్ప విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తమిళంలో డబ్ అవుతుంది. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వెర్షన్ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
'రంగస్థలం' మూవీ ఇప్పటికే మలయాళంలోకి డబ్ అవడంతో పాటు అక్కడ రిలీజ్ కూడా అయింది. అలాగే, కన్నడంలోకీ వచ్చేసింది. ఈ రెండు భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీని తమిళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కాసేపటి క్రితం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. అంతేకాదు... 'పుట్టినరోజు శుభాకాంక్షలు రామ్ చరణ్. తమిళనాడులోని రామ్ చరణ్ అభిమానుల కోరిక మేరకు 'రంగస్థలం' తమిళ వెర్షన్‌ను మేలో విడుదల చేయబోతున్నాం. దీన్ని 7జీ ఫిల్మ్ రిలీజ్ చేస్తుంది' అని వెల్లడించింది. దీంతో కోలీవుడ్‌లోని మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'రంగస్థలం'లో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపించాడు. అద్భుతమైన నటనతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్, ప్రకాశ్ రాజ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో వచ్చిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











