మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్: ఈరోజే రామ్ చరణ్ మూవీ ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ప్రవేశించి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను అందుకున్నాడతను. అందులో 'రంగస్థలం' ఒకటి. లెక్కల మాస్టారు సుకుమార్ రూపొందించిన ఈ సినిమా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో పాటు చరణ్‌లోని మరో నటుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. అలాగే, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఫలితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఎన్నో రికార్డులు సైతం బద్దలు అయిపోయాయి.
సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు
ఇంతటి విజయాన్ని అందుకున్న 'రంగస్థలం' చిత్రాన్ని తమ తమ భాషల్లోకి డబ్బింగ్ చేసుకోడానికి ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా మలయాళంలోకి డబ్ అవడంతో పాటు అక్కడ రిలీజ్ కూడా అయింది. అలాగే, కన్నడంలోకీ వచ్చేసింది. ఈ రెండు భాషల్లోనూ మంచి స్పందననే అందుకుంది. ఇక, ఇప్పుడు 'రంగస్థలం' తమిళంలోకి కూడా డబ్బింగ్ అయింది. అంతేకాదు, ఏప్రిల్ 30న అక్కడ విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది.

విడుదలకు సమయం దగ్గర పడడంతో 'రంగస్థలం' తమిళ వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే శ్రీరామనవమి కానుకగా ఈరోజే దీన్ని విడుదల చేస్తున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను 7జీ ఫిల్మ్ సంస్థ తమిళం రిలీజ్ చేస్తుంది. 'రంగస్థలం'లో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా కనిపించాడు. సమంత హీరోయిన్‌గా నటించగా.. ఆది పినిశెట్టి, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్, ప్రకాశ్ రాజ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











