రామ్ చరణ్ మూవీ కోసం శంకర్ సూపర్ ప్లాన్: ముందు అవే పూర్తి చేస్తారట
'వినయ విధేయ రామ' వచ్చి మూడేళ్లు కావొస్తున్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా విడుదల కాలేదు. కానీ, అతడు నటిస్తోన్న రెండు చిత్రాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. అందులో ఒకటి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం) కాగా.. ఇంకోటి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ - చిరంజీవి కాంబోలో వస్తున్న 'ఆచార్య' మరొకటి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఇక, వీటి తర్వాత చరణ్.. ద గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేయనున్నాడు. తాజాగా దీనిపై ఓ అప్‌డేట్ వచ్చింది.
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కాబోతుందట. అంతేకాదు, ముందుగా ఈ సినిమాలోని పాటలనే చిత్రీకరించబోతున్నారని అంటున్నారు. కోవిడ్ నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో జరగాల్సిన షెడ్యూల్‌నే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట శంకర్. అందుకే ముందుగా పాటలను కంప్లీట్ చేస్తారని తెలిసింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తుందని అనుకున్నా.. కన్నడ పిల్ల రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక, ఇందులో రామ్ చరణ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే, మరో పాత్రలోనూ అతడు కనిపిస్తాడని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనే తెరకెక్కుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది.


Click it and Unblock the Notifications











