For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శంకర్ సినిమా కోసం రామ్ చరణ్ డేరింగ్ స్టెప్: అంగరంగ వైభవంగా స్పెషల్ ఈవెంట్ ప్లాన్

  |

  బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'వినయ విధేయ రామ'తో బిగ్ డిజాస్టర్‌ను చవి చూశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇది వచ్చి దాదాపు మూడేళ్లు కావొస్తున్నా.. ఈ స్టార్ హీరో నటించిన మరో చిత్రం విడుదల కాలేదు. కానీ, అతడు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లోనూ భాగం అయ్యాడు.

  Mukku Avinash Engagement: నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అవినాష్.. ఆ అమ్మాయి ఎవరంటే!

  ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తోన్న రెండు చిత్రాల షూటింగ్‌లు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతడు తన తదుపరి సినిమాను అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో దేశ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా శంకర్ మొదలు పెట్టి.. దాదాపుగా వాటిని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్‌ మీద దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.

  అటు RRR.. ఇటు ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. దీంతో తన పదిహేనవ సినిమాపై ఈ మెగా హీరో పూర్తి స్థాయిలో ఫోకస్ చేశాడని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు వీలైనంత త్వరగా దాన్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు శంకర్‌తో ఈ విషయంపై చర్చలు కూడా జరిపాడనే టాక్ వినిపిస్తోంది. అలాగే, ఎప్పటికి దీన్ని విడుదల చేయాలన్న దానిపైనా యూనిట్ ఓ అంచనాకు వచ్చిందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సెప్టెంబర్ 13వ తేదీని అధికారికంగా మొదలు పెడుతారని తెలుస్తోంది.

  బ్రా కూడా లేకుండా రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా: అందాలు మొత్తం కనిపించేలా మరీ దారుణంగా!

  Ram Charan - S. Shankar Movie Starts From September 13th

  దిగ్గజ దర్శకుడు శంకర్ - స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను సెప్టెంబర్ 13న చిత్ర నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో గ్రాండ్‌ను చేయబోతున్నారట. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే మొదలు పెట్టారని తెలుస్తోంది. ఇక, అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకకు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారని సమాచారం. అంతేకాదు, ఈ పూజా కార్యక్రమాలు పూర్తైన రెండు మూడు రోజులకే ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూట్ కూడా మొదలవుతుందని తెలిసింది.

  భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా 'ఒకే ఒక్కడు' నేపథ్యంతో సాగే పొలిటిక్ డ్రామా అని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందించనున్న విషయం తెలిసిందే.

  English summary
  Mega Power Star Ram Charan Now Doing RRR Under Rajamouli Direction. After This he will do a film with S. Shankar. This Movie Starts From September 13th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X