For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోతో పెళ్ళంటూ ప్రచారం.. అనూహ్యంగా ప్రియుడిని పరిచయం చేసిన రామ్ చరణ్ మరదలు?

  |

  తెలుగులో వరుసగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత హీరో హీరోయిన్ల మధ్య ఏదో సంబంధం ఉందని మీడియా వార్తలు సృష్టిస్తూ ఉండటం చాలా కామన్. కానీ అసలు ఏ మాత్రం సినిమా రంగానికి సంబంధం లేని ఉపాసన సోదరి ఏకంగా ఒక హీరోతో ప్రేమలో ఉందని ఆయనతో పెళ్లి కూడా జరగబోతోంది అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు అన్నింటినీ ఆమె ఈ రోజుతో పుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకంటే ఆమె తన ప్రియుడిని పరిచయం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

  రామ్ చరణ్ తో పెళ్లి

  రామ్ చరణ్ తో పెళ్లి

  సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ ఉపాసన కామినేని తో ప్రేమలో పడి 2010వ సంవత్సరంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె కాస్త సైలెంట్ అయ్యారు గాని కొన్నాళ్ళ క్రితం వరకు ఒక పక్క రామ్ చరణ్ గాని మరోపక్క చిరంజీవి గాని సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ కలిగి ఉండేవారు కాదు. ఆ సమయంలో ఫ్యాన్స్ కి మెగా హీరోలకు మధ్య వారధిలా పనిచేస్తూ తన సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ఉండేవారు.

  ఏమాత్రం సంబంధం లేకుండా

  ఏమాత్రం సంబంధం లేకుండా

  ఒక హీరోకి భార్యగా తప్ప సినిమా రంగంతో మరే సంబంధం లేని ఉపాసన రామ్ చరణ్ భార్య అయ్యాక ఇతర హీరోలతో హీరోయిన్లతో కొంచెం సంబంధ బాంధవ్యాలు పెంచుకో గలిగారు. అపోలో లైఫ్ స్టూడియోస్ నడుపుతున్న ఆమె సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లతో ఫిట్నెస్ కు సంబంధించిన వీడియోలు చేస్తూ ప్రజలలో ఫిట్ నెస్ కు సంబంధించిన విషయాల మీద ఆసక్తి రేకెత్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆమె సోదరి అనుష్పల కూడా సినిమా రంగానికి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి.

  2016 నుంచి

  2016 నుంచి

  అయితే అనుకోకుండా ఆమె యువ హీరో శర్వానంద్ తో ప్రేమలో పడ్డారని వారిద్దరికీ త్వరలోనే పెళ్లి కాబోతోందని 2016 నుంచి అడపాదడపా ప్రచారం జరుగుతూనే వస్తోంది. రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం చిన్న వయస్సు నుంచి ఇద్దరి మధ్య మంచి ర్యాపో ఉండటం తో రామ్ చరణ్ స్వయంగా వీరిద్దరికీ పెళ్లి పెద్దగా వ్యవహరిస్తూ ఇద్దరి ఇళ్ళలో మాట్లాడి సంబంధం కుదిర్చే పనిలో పడ్డారని, ఈ ఏడాది పెళ్లి కూడా చేస్తారని కూడా ప్రచారం జరిగింది.

  నో ఖండన

  నో ఖండన

  అయితే ఇది ప్రచారానికే పరిమితం కాగా అటు శర్వానంద్ తరపునుంచి కానీ ఉపాసన కుటుంబం నుంచి గానీ దీనికి సంబంధించి ఎలాంటి ఖండనలురా లేదు. అయితే అనూహ్యంగా ఈరోజు అనుష్పల తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక వ్యక్తి ఫోటో షేర్ చేసి ఒక లవ్ సింబల్ తో కామెంట్ పెట్టారు. అంతకు మించి ఎలాంటి కామెంట్స్ చేయకపోయినా అనుష్పల తన ప్రియుడిని పరిచయం చేయడానికే ఈ పోస్ట్ పెట్టారని ప్రచారం జరుగుతోంది.

  Swapnika Exclusive Interview Part 4 | Sarkaru Vaari Paata AD ​| Filmibeat Telugu
  కార్ రేసర్

  కార్ రేసర్

  దీనికి సంబంధించి మంచు లక్ష్మి సహా కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా లవ్ సింబల్స్ తో స్వాగతిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇక అనుష్పల టాగ్ చేసిన వ్యక్తి అర్మాన్ ఇబ్రహీం కాగా ఆయన ఒక అథ్లెటిక్ అన్నట్లుగా ఆయన ఇంస్టాగ్రామ్ బయలో పేర్కొని ఉంది. అర్మాన్ ఇబ్రహీం ఒక కారు రేసర్. చెన్నైకి చెందిన ఆయన మాజీ భారత ఎఫ్ 3 ఛాంపియన్ అక్బర్ ఇబ్రహీం కుమారుడు అని అంటున్నారు.

  English summary
  There have been reports from 2016 that Tollywood actor Sharwanand will be getting married to Upasana Kamineni's sister. Since Sharwanand and Ram Charan are best buddies, the actor has also become friends with Upasana and her sister as well. but in a shocking update anushpala Kamineni introduced her love.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X