లండన్‌లో ఆ 30 రోజులు.. రామ్ చరణ్ ఏం చేశాడో తెలుసా..? ప్లానింగ్ భలే ఉందే!

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ మేరకు సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ మరింత ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా సైరా ఆడిషన్స్‌కి సంబంధించిన ఓ వార్త ప్రేక్షకలోకంలో ఇప్పటికే ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

 ఏకంగా 30 రోజులు లండన్‌లోనే

ఏకంగా 30 రోజులు లండన్‌లోనే

తండ్రి చిరంజీవికి బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశంతో సైరా నరసింహా రెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రామ్ చరణ్.. ఏ ఒక్క విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. చిత్రానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ భారీ రేంజ్‌లో తెరకెక్కించారు. సైరా నటీనటుల కోసం ఏకంగా 30 రోజులు లండన్‌లోనే గడిపాడట చెర్రీ.

రియాలిటీకి దగ్గరగా ఉండాలనే కోణంలో

రియాలిటీకి దగ్గరగా ఉండాలనే కోణంలో

సైరా నరసింహా రెడ్డి సినిమా స్వాతంత్య సమరయోధుడి జీవిత కథ కావడంతో ఇందులో నటించే నటీనటుల పట్ల స్పెషల్ కేర్ తీసుకున్నారు రామ్ చరణ్. ప్రతీ క్యారెక్టర్ కూడా రియాలిటీకి దగ్గరగా ఉండాలనే కోణంలో బ్రిటిష్ వాళ్ళుగా నటించేందుకు గాను లండన్ నుంచి నటీనటులను ఎంపిక చేశారు రామ్ చరణ్. ఈ విషయాన్ని స్వయంగా చిత్రయూనిట్ ప్రకటించడంతో సినిమాపై మరింత హైప్ నెలకొంది.

100 మందిని టెస్ట్ చేసి చివరకు

100 మందిని టెస్ట్ చేసి చివరకు

ఇంగ్లీష్ వాళ్ళ కోసం లండన్ వెళ్లిన రామ్ చరణ్ బృందం అక్కడ దాదాపు 100 మందికి ఆడిషన్ నిర్వహించిందట. చివరకు వారి నుంచి ది బెస్ట్ అయిన ఏడుగురిని తీసుకొని సైరాలో ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రెష్ ఉద్యోగుల క్యారెక్టర్ చేయించారు. ఈ ఏడు క్యారెక్టర్స్ కూడా రియాలిటీకి అత్యంత దగ్గరగా ఉంటాయని చెబుతోంది చిత్రయూనిట్.

ప్యాన్ ఇండియా మూవీ కావడంతో

ప్యాన్ ఇండియా మూవీ కావడంతో

సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్‌లో అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పటు పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో దేశవ్యాప్తంగా 'సైరా'పై క్యూరియాసిటీ పెరిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ఆడియన్స్ అంతా సైరా విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్ రిపోర్ట్

టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్ రిపోర్ట్

ఇదిలా ఉంటే 'సైరా నరసింహా రెడ్డి' టీజర్, ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ వీడియోల్లో చూపిన పోరాట సన్నివేశాలు చూసి షాక్ అవుతున్నారు ప్రేక్షకులు. దీంతో ఇవి సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతూ సరికొత్త రికార్డులకు తెరలేపాయి. ఇక సైరా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

సైరా నరసింహా రెడ్డి మూవీ

సైరా నరసింహా రెడ్డి మూవీ

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X