Game Changer: ఊహించని గెటప్‌లో రామ్ చరణ్.. పూనకాలు తెప్పించేలా మరో ట్రీట్

కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాలను చేసుకుంటూ వెళ్లినా.. ఈ మధ్య కాలంలో మాత్రం వరుసగా ప్రయోగాలు చేస్తూ.. తనలోని సత్తాను మరింతగా బయటకు తీసుకొస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీనికితోడు ఇటీవలి కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ దూసుకుపోతోన్న ఈ మెగా హీరో.. గత ఏడాది వచ్చిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీనితో పాటు గ్లోబర్ స్టార్‌ అనే పేరును కూడా సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి మరింత జోష్‌తో రామ్ చరణ్ ముందుకు సాగుతోన్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన 70 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా విజయవంతంగా పూర్తైంది. దీంతో మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది. అందుకు అనుగుణంగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.

Ram Charan Second Look will Release From Game Changer

రామ్ చరణ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'గేమ్ చేంజర్' చిత్రం నుంచి ఇటీవలే టైటిల్ పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఈ మెగా హీరో స్టైలిష్ గెటప్‌తో దర్శనమిచ్చాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మరో పోస్టర్‌ను కూడా కొద్ది రోజుల్లోనే విడుదల చేస్తారని తెలిసింది. ఇందులో మాత్రం రామ్ చరణ్ ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే తెలుగు రంగు సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తాడని అంటున్నారు. దీనిపై ఈ వారంలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇక, ఇందులో చరణ్ 'అభ్యుదయం' పార్టీ నాయకుడిగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

'గేమ్ చేంజర్' చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X