డైరెక్టర్ బుచ్చిబాబు‌కు రామ్ చరణ్ - ఉపాసనల సర్‌ప్రైజ్ గిఫ్ట్ .. ఏం పంపారంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానం పొందుతున్నారు. సెట్స్‌లో అందరినీ గౌరవించడంతో పాటు తన సన్నిహితులకు గిఫ్ట్‌లు పంపి సర్‌ప్రైజ్ చేయడం ఆయనకు అలవాటు . తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు సానాను స్పెషల్ గిఫ్ట్‌తో తన భార్య ఉపాసన కామినేనితో కలిసి సర్‌ప్రైజ్ చేశారు. బుచ్చిబాబుకు రాం చరణ్ ఏం పంపారు? ఎందుకు పంపారు? ఆ గిఫ్ట్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే..

గేమ్ ఛేంజర్ తర్వాత తన కెరీర్‌లో 16వ చిత్రాన్ని ఉప్పెన ఫేం దర్శకుడు బుచ్చిబాబుతో చేస్తున్నారు రామ్ చరణ్. రామ్ చరణ్‌తో ఈ సినిమా తీయాలని ఎప్పటి నుంచో స్క్రిప్ట్‌ రెడీ చేసుకుని కూర్చొన్నాడు. మధ్యలో గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు ప్రాజెక్ట్ వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లడమే కాదు .. సినిమాను వేగంగా షూట్ చేస్తున్నారు బుచ్చిబాబు. ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. అదే పెద్ది.

ram charan sends gifts to buchi babu sana here is the Peddi director reply

గ్రామీణ వాతావరణంలో జరిగి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమా తెరకెక్కుతోందని ఫిలింనగర్ టాక్. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇది రెండో సినిమా. ఇక కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ పెద్దిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా కీలకపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన నటీనటులు , టెక్నీషియన్ల వివరాలు త్వరలోనే తెలియయనున్నాయి.

ఆస్కార్ అవార్డ్ గ్రహీత, మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ సినిమాపై చిత్ర సీమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌లు పెద్ది చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6న పెద్ది సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ కోసం మెగా , రాం చరణ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ నేపథ్యంలో పెద్ది ఘన విజయం సాధించాలని వారు కోరుకుంటున్నారు.

ఇటీవల తన 40వ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబుకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్ చేశారు. తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి స్పెషల్ గిఫ్ట్ పంపారు. దీనికి సంబంధించిన విషయాన్ని బుచ్చితన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో ఓ స్పెషల్ నోట్‌తో పాటు హనుమాన్ చాలీసా, గోల్డ్ ప్లేటెడ్ శ్రీరామ పాదాలు, హనుమంతుడి విగ్రహం, ఒక కాఫీ కప్ ఉన్నాయి. చరణ్ సార్, ఉపాసన గారి ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటానని .. హనుమంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని బుచ్చిబాబు ఆకాంక్షించారు. రామ్ చరణ్ తన విలువలతో ఎప్పుడూ తనలో స్పూర్తి నింపుతుంటారని బుచ్చిబాబు అన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ గిఫ్ట్, దానికి బుచ్చిబాబు రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: ram charan buchi babu sana peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X