Game Changer: కేవలం పాటలకే అన్ని కోట్ల ఖర్చు.. ఒక్కో కొరియోగ్రాఫర్‌తో స్టెప్పులు.. అది దా శంకర్ సార్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR సినిమాతో ఎలా పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయాడు. అయితే RRR తర్వాత సరైన హిట్ పడని చెర్రీ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
అందులో ఒకటే గేమ్ చేంజర్ (Game Changer Movie) మూవీ. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచానాలే నెలకొన్నాయి. అయితే శంకర్ సినిమాల్లో పాటలకు ఉండే ఇంపార్టెన్స్ తెలిసిందే. ఎప్పటిలానే గేమ్ చేంజర్ మూవీలో కేవలం పాటలకే కోట్లల్లో ఖర్చు చేశాడట.

హీరోగా-నిర్మాతగా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. గేమ్ చేంజర్ సినిమాతోపాటు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ మూవీని రామ్ చరణ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఇలా హీరోగానే కాకుండా నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్, మెగా పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు సైతం నిర్మిస్తున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ది ఇండియా హౌజ్ మూవీని ఇదివరకే ప్రకటించారు.

రెండోసారి: ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విషయానికొస్తే ఇది సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ రెండోసారి రామ్ చరణ్ తో జత కడుతున్న విషయం తెలిసిందే.

ఒకే ఒక్కడు నుంచి: గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ సినిమాల్లో సాంగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. క్వాలిటీనే కాకుండా హై బడ్జెట్ లో పాటలు తెరకెక్కిస్తుంటారు. ఒకే ఒక్కడు నుంచి మొన్నటి ఐ వరకు చాలా గ్రాండ్ గా తీశారు.
ఒక్కో కొరియోగ్రాఫర్: శంకర్ ఓల్డ్ చిత్రాల తరహాలోనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో పాటలకు కూడా భారీగా ఖర్చు చేశారట. గేమ్ చేంజర్ సినిమాలోని పాటలకే దాదాపుగా రూ. 90 కోట్లు ఖర్చు చేశారని సోషల్ మీడియాలో తెగ టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఇందులో అన్నీ పాటలకు ఒక్క కొరియోగ్రాఫర్ మాత్రమే వర్క్ చేయలేదట. ప్రభుదేవా, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, గణేష్ మాస్టర్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో పాట చేసినట్లు సమాచారం.

అలా చూపించాను: గేమ్ చేంజర్ ఈ మూవీ ఆల్బమ్ గురించి జానీ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తమన్ అయితే సాంగ్స్ అదరగొట్టేశాడు. "మేము ఆల్రెడీ షూట్ చేసేశాం కాబట్టి చెబుతున్నాను. సాంగ్స్ అదిరిపోయాయి. చించేశారు. దానికి మించి ఇంకేమి చెప్పలేను. నా ప్రయత్నం నేను చేశాను. చరణ్ సార్ మీద నాకు ఎంత లవ్ ఉందో ఆ ప్రేమ అంతా కొరియోగ్రఫీలో చూపించాను. మిగతాది ఆడియెన్స్ చేతిలో ఉంది" అని జానీ మాస్టర్ వెల్లడించాడు.
కొత్తగా ట్రై చేశాం: జానీ మాస్టర్ ఇంకా కొనసాగిస్తూ.. "పాటలను చాలా కొత్తగా ట్రై చేశాం. అది ఇప్పటివరకూ నాకు తెలిసీ ఎవరూ ట్రై చేయలేదు. చాలా కొత్త కాన్సెప్ట్ ఇది. శంకర్ సార్ నాకు మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. దానికి వర్క్ చేయడానికి నాకు అవకాశం కూడా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. 100 శాతం ఇందులో పాటలు అందరికీ నచ్చుతాయి" అని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











