రామ్ చరణ్, శంకర్ మూవీ స్టోరీ లీక్.. ఈ కథలను నమ్మకపోవడమే మంచిది.. ఎందుకంటే?

దేశం మెచ్చిన సంచలన దర్శకుడు శంకర్ మొదటిసారి డైరెక్ట్ తెలుగు హీరోతో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే. శంకర్ తమిళ్ లో ఏ సినిమా చేసినా కూడా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాకుండా ఉండదు. శంకర్ బ్రాండ్ తోనే తమిళ సినిమాలకు మిగతా భాషల్లో మార్కెట్ పెరుగుతూ వచ్చింది. ఇక రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఆ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒకటి వైరల్ అవుతోంది.

శంకర్ ఎంతో ఇష్టంతో..

శంకర్ ఎంతో ఇష్టంతో..

రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు ఒక బిగ్ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. RRR తరువాత రామ్ చరణ్ చేయబోతున్న సినిమా కాబట్టి తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా బజ్ క్రియేట్ చేయగలేదని చెప్పవచ్చు. పైగా శంకర్ ఎంతో ఇష్టంతో తొలిసారిగా తెలుగు హీరోతో చేస్తున్నాడు.

చరణ్ కోసం స్పెషల్ ఆఫీస్

చరణ్ కోసం స్పెషల్ ఆఫీస్

తెలుగు ఆడియెన్స్ అంటే శంకర్ కు చాలా ఇష్టం. చాలా సినిమాల ఈవెంట్స్ లలో తప్పకుండా ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానని చెబుతూ వస్తున్నాడు. ఇక ఇన్నాళ్లకు ఒక ప్లాన్ సెట్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్ ప్రాజెక్టు కోసం చెన్నైలోనే ఒక స్పీషల్ ఆఫీస్ ను క్రియేట్ చేసుకొని ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేశారు.

స్టోరీపై రూమర్స్..

స్టోరీపై రూమర్స్..

అయితే వీరి కాంబోలో రానున్న సినిమాపై చాలా రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా కథకు సంబంధించిన గాసిప్స్ చాలానే వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో ఒకే ఒక్కడు తరహాలో ఉంటుందని అంటున్నారు. ఒక్కరోజు సీఎంగా కాకుండా అనుకున్న టార్గెట్స్ ఫినిష్ చేసే సీఎంగా రామ్ చరణ్ కనిపించనున్నట్లు టాక్ వస్తోంది.

నమ్మకపోవడమే మంచిది

నమ్మకపోవడమే మంచిది

ఏదేమైనా సినిమాలో మాత్రం మంచి సోషల్ మెస్సేజ్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా శంకర్ మార్క్ కు తగ్గట్లుగానే ఉంటాయని చెప్పవచ్చు. ఇక వినిపిస్తున్న గాసిప్స్ పై క్లారిటీ రావాలంటే సినిమా సెట్స్ పైకి వచ్చినా కూడా తెలియదు. ఎందుకంటే శంకర్ చిన్న పాయింట్ ను కూడా లీక్ చేయడానికి ఇష్టపడరు. సో.. సినిమా రిలీజ్ అయ్యే వరకు గాసిప్స్ ను అంతగా నమ్మకుంటే మంచిదని ఓ వర్గం అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X