RC15: వైజాగ్ లో రామ్ చరణ్ సందడి.. హై రేంజ్ లో చెర్రీ ఇంట్రడక్షన్.. శంకర్ భారీ ప్లాన్!

ప్రస్తుతం రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. మెగా పవర్ స్టార్ గా తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అంతేకాకుండా జక్కన్న తెరకెక్కించిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెగ పాపులర్ అయిపోయాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటనపై తెలుగు ప్రేక్షకులు, సినీ విమర్శకులే కాకుండా విదేశీయులు సైతం కొనియాడుతున్నారు. దీంతో హాలీవుడ్ మూవీస్ నుంచి ఆఫర్లు కూడా వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇలాంటి స్టార్ డమ్ ఉన్న రామ్ చరణ్ కు ఆయన తర్వాతి సినిమాలో ఇంట్రడక్షన్ కోసం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ భారీగా స్కెచ్ వేశాడని టాక్.

చెర్రీ నటనకు..

చెర్రీ నటనకు..

స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయిన చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. డ్యాషింగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇటీవల RRR సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అదరగొట్టాడు. చెర్రీ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కొనియాడటమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. ఆ తర్వాత చిరు-చెర్రీ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య మాత్రం పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

శంకర్ దర్శకత్వంలో..

శంకర్ దర్శకత్వంలో..

చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారనడంతో ఆచార్య మూవీపై హైరేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. అయితే అభిమానులు, ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆచార్య లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక RRRతో హిట్ కొట్టి, ఆచార్యతో ఫ్లాప్ మూటగట్టుకున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను చాలా పకడ్బందీగా ఉండాలనుకున్నాడట. అందుకే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

 భారీ స్థాయిలో విడుదల..

భారీ స్థాయిలో విడుదల..


లెజండరీ దర్శకుల్లో ఒక్కరైన శంకర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC15. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా తెలుగు, కోలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా సినిమాగా మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

పాతబస్తీలో సాంగ్ షూట్..

పాతబస్తీలో సాంగ్ షూట్..

ప్రస్తుతం RC15 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఓ పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లిన RC15 చిత్రబృందం సుమారు 10 రోజులపాటు ఈ పాటను చిత్రీకరించాని సమాచారం. అయితే ఈ ఒక్కపాట కోసం రూ. 8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే డైరెక్టర్ శంకర్ సినిమాల్లో పాటలు ఎంత లావిష్ గా, రిచ్ గా ఉంటాయో తెలిసిందే. అలాగే హైదరాబాద్ పాతబస్తీలో కూడా ఒక సాంగ్ షూట్ చేశారు.

 గీతం యూనివర్సిటీలో సందడి..

గీతం యూనివర్సిటీలో సందడి..

హైదరాబాద్ పాతబస్తీలో రామ్ చరణ్ మీద సోలో సాంగ్ కు సంబంధించిన షూటింగ్ చేసినట్లు టాక్. కొండారెడ్డి బురుజు వద్ద తండ్రి పాత్రలో రామ్ చరణ్ చేస్తున్న పాటన షూటింగ్ చేశారు. అభ్యుదయ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నట్లుగా ఉండే ఆ పాటకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఎంటైర్ సినిమా యూనిట్ వైజాగ్ చేరుకుంది. రామ్ చరణ్ తోపాటు శంకర్, మిగతా టెక్నీషియన్స్ అందరూ విశాఖలోని గీతం యూనివర్సిటీలో సందడి చేస్తున్నారు.

ఏకంగా అలా ప్లాన్ చేసిన శంకర్..

ఏకంగా అలా ప్లాన్ చేసిన శంకర్..


వైజాగ్ గీతం యూనివర్సిటీలో రామ్ చరణ్ కలెక్టర్ పాత్రకు సంబంధించి.. ఇంట్రడక్షన్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. ఈ పాట కోసం శంకర్ భారీగానే ప్లాన్ చేశారని టాక్. రామ్ చరణ్ ఎంట్రీని ఏకంగా హెలీకాఫ్టర్ లో షూట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. RRRతో చెర్రీ రేంజ్ పెరగడంతో.. శంకర్ ఇలా ప్లాన్ చేశారని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X