twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RC15: పాతబస్తీలో రామ్ చరణ్ సోలో సాంగ్.. ఆ నెలలో షూటింగ్ పూర్తి.. శంకర్ భారీ ప్లాన్!

    |

    మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. డ్యాషింగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇటీవల RRR సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు మరో క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. RC15గా వస్తున్న ఈ మూవీని తెలుగు, తమిళంలేనే కాకుండా పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో రెండో సారి చెర్రీ జతకట్టనుంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

     విమర్శకుల ప్రశంసలు..

    విమర్శకుల ప్రశంసలు..

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. ఆ సినిమా ఇటీవల అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఎమ్ఎమ్ కీరవాణి మ్యాజికల్ మ్యూజిక్ గా వచ్చిన ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టాడు. చెర్రీ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కొనియాడటమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. ఆ తర్వాత చిరు-చెర్రీ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య మాత్రం పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

    పాన్ ఇండియా చిత్రంగా..

    పాన్ ఇండియా చిత్రంగా..

    ఆచార్య ఫ్లాప్ తో తర్వాతి సినిమాను చాలా ప్రత్యేకంగా తీసకున్నాడు రామ్ చరణ్. అందుకే నెక్ట్స్ ఎలాగైన పెద్ద హిట్ కొట్టాలని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో జతకట్టిన విషయం తెలిసిందే. వీళ్లద్దరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం RC15. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు, తమిళ భాషలకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా సినిమాగా మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

    మరో షెడ్యూల్ స్టార్ట్..

    మరో షెడ్యూల్ స్టార్ట్..

    RC15 మూవీ షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవలే ఓ పాట చిత్రీకరణ కోసం న్యూజిలాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. సుమారు 10 రోజులపాటు ఈ పాటను చిత్రీకరించాని సమాచారం. అయితే ఈ ఒక్కపాట కోసం రూ. 8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే డైరెక్టర్ శంకర్ సినిమాల్లో పాటలు ఎంత లావిష్ గా, రిచ్ గా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు త్వరలో మరో షెడ్యూల్ స్టార్ట్ కానుందట.

     చరణ్ కోసం స్పెషల్ గా..

    చరణ్ కోసం స్పెషల్ గా..

    తాజాగా మొదలు అయ్యే షెడ్యూల్ లో మరో పాటను చిత్రీకరించనున్నారట. హైదరాబాద్ పాతబస్తీలో రామ్ చరణ్ మీద సోలో సాంగ్ కు సంబంధించిన కొంత షూటింగ్ చేయనున్నారట. అలాగే మిగతా పార్ట్ ను రాజమండ్రి, విశాఖలో షూట్ చేయనున్నట్లు సమాచారం. ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్ లోని ఈ రెండు నగరాల్లో షూట్ చేశారు. ఇప్పుడు మరోసారి తీయనున్నారు. ఇక శంకర్ సినిమాల్లో పాటలకు ప్రత్యేకత ఉంటుంది. పాటల్లో భారీతనం కనబడుతుంది. ఇప్పుడు రామ్ చరణ్ కోసం అలాంటి సాంగ్స్ ప్లాన్ చేశారట డైరెక్టర్ శంకర్.

    ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెర్రీ..

    ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెర్రీ..

    RC15 సినిమాలో ఈ మధ్య విదేశాల్లో బాస్కో సీజర్ కొరియోగ్రఫీలో తెరకెక్కించిన సాంగ్ కూడా హైలెట్ కానుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయనున్న విషయం తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించనున్నాడు. అభ్యదయం పార్టీ సీఎం క్యాండిడేట్ చరణ్ అంటూ రాజమండ్రి, విశాఖలో షూట్ చేసిన సీన్స్ లీక్ అయిన విషయం తెలిసిందే.

     ఆ నెలాఖరుకు పూర్తి..

    ఆ నెలాఖరుకు పూర్తి..

    ఫ్లాష్ బ్యాక్ లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా.. ప్రజంట్ పాత్రలో ఐఏఎస్ అధికారిగా రామ్ చరణ్ కనిపించనున్నాడు. అలాగే ఇందులో తండ్రీ కొడుకులుగా రెండు పాత్రలు పోషించనున్నాడట చరణ్. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని జూన్ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. ఈ చిత్రంలో కియారా అద్వానీ ఒక హీరోయిన్ కాగా.. మరో హీరోయిన్ గా అంజలి చేస్తుంది. అంజలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చెర్రీ భార్యగా నటించనుందని సమాచారం. ముఖ్యమంత్రిగా శ్రీకాంత్ నటించనుండగా.. సునీల్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నవీన్ చంద్ర తదితరులు యాక్ట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర పతాకంపై దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

    English summary
    Mega Power Star Ram Charan And Director Shankar Combination Movie RC15 Special Song Schedule In Hyderabad Old City And Vizag, RC15 Shooting Will Complete In June Month.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X