Ram Charan: రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం.. గ్లోబల్ స్థాయిలో మెగా పవర్ స్టార్‌ క్రేజ్.

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ అరుదైన గౌరవాన్ని అందించింది. ప్రఖ్యాత అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఎస్క్వైర్ ఇండియా' తాజా ఎడిషన్ కవర్‌ పేజీపై చరణ్ మెరిశారు.

ఈ ప్రత్యేక ఫోటోషూట్‌ను హాంకాంగ్‌లో నిర్వహించారు. ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమా కోసం చరణ్ పెంచుకున్న సరికొత్త హెయిర్‌స్టైల్, లుక్‌తోనే ఈ షూట్‌లో కనిపించడం విశేషం. ఈ ఫోటోలు విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Ram Charan Shines on Esquire India Cover Gains Rare Global Recognition After RRR

ఎస్క్వైర్ ఇండియా తన కవర్ స్టోరీలో రామ్ చరణ్‌ను "ప్రస్తుత తరాన్ని ప్రభావితం చేస్తున్న గ్లోబల్ ఫోర్స్"గా అభివర్ణించడం విశేషం. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడంలో చరణ్ కీలకమని మ్యాగజైన్ ప్రశంసించింది. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఆయనకు వచ్చిన గుర్తింపు, హాలీవుడ్ స్థాయిలో కూడా చర్చనీయాంశం కావడం ఈ గౌరవానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ కవర్ ఫీచర్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించగా, ఇప్పుడు అదే ఘనత సాధించిన రెండో తెలుగు హీరోగా రామ్ చరణ్ నిలవడం టాలీవుడ్‌కు గర్వకారణంగా మారింది. దీంతో మెగా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు కూడా ఈ విషయాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ ఫోటోషూట్‌లో చరణ్ స్టైలింగ్, బాడీ లాంగ్వేజ్, ప్రెజెన్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండటం విశేషం. ముఖ్యంగా "Ram Charan doesn't arrive... he rises!" అనే ట్యాగ్‌లైన్ ఆయన కెరీర్‌ను ప్రతిబింబించేలా ఉంది.

సాధారణ హీరోగా ప్రారంభమైన రామ్ చరణ్ ప్రయాణం, ఇప్పుడు గ్లోబల్ స్టార్ స్థాయికి చేరకుంది. ఈ కవర్ ద్వారా మరింత హైలైట్ అయింది. ముఖ్యంగా 'పెద్ది' సినిమా కోసం చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ది సినిమాలోని పాత్ర కోసం చరణ్ దాదాపు ఏడాది కంటే ఎక్కువ సమయం శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం నేషనల్ లెవెల్ కోచ్‌ల వద్ద ట్రైనింగ్ తీసుకోవడం, కఠినమైన డైట్ ఫాలో కావడం వంటి విషయాలు వెల్లడించారు. అంతేకాదు, అయ్యప్ప దీక్ష పాటిస్తూ డిసిప్లిన్‌ను మెయింటైన్ చేయడం కూడా తనకు మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చిందని చెప్పారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు బుచ్చి బాబు సనా (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్సెస్, పాటలు మంచి స్పందన పొందడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఒకవైపు అంతర్జాతీయ మ్యాగజైన్ కవర్‌పై మెరిసి గ్లోబల్ గుర్తింపు పొందుతూ, మరోవైపు భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న రామ్ చరణ్ ప్రస్తుతం కెరీర్ పీక్‌లో ఉన్నాడని చెప్పాలి. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తన ప్రభావాన్ని చూపుతున్న ఈ మెగా హీరో, భవిష్యత్తులో ఇంకా ఎన్ని మైలురాళ్లు చేరుకుంటాడో చూడాలి. రామ్ చరణ్ పేరు ఇప్పుడు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు.. అది గ్లోబల్ బ్రాండ్‌గా మారిపోయింది.

Read more about: jr ntr ram charan rrr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X