Game Changer: బిగ్ ఫైట్‌కు రెడీ అయిన చరణ్.. వామ్మో అసలైంది ఇదేనా!
ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను అందుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అంతేకాదు, దర్శకధీరుగు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో అతడు మరో ఇండస్ట్రీ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ సినిమాతో ఈ మెగా హీరో గ్లోబర్ స్టార్ అనే పేరును కూడా అందుకున్నాడు. దీంతో ఈ చరణ్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తోన్నాడు. ఈ జోష్‌లోనే ఇప్పుడు ఈ స్టార్ హీరో 'గేమ్ చేంజర్' అనే సినిమాలో నటిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమాను దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి.

దీంతో ఇప్పటికి దీనికి సంబంధించిన 60 శాతానికి పైగా టాకీ పార్ట్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. ఇక, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ లీకైంది.
క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది. కానీ, రామ్ చరణ్‌కు కూతురు జన్మించడంతో అతడు షూట్‌కు హాజరు కాలేకపోయాడు. దీంతో అతడు లేని సన్నివేశాలను చిత్రీకరించి మిగిలింది వాయిదా వేశారు.
ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను జూలై 10వ తేదీ నుంచి మొదలెట్టబోతున్నారట. ఇది ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఇందులో చరణ్‌తో పాటు పదుల సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటారని సమాచారం. ఈ ఫైటే సినిమాలో హై రేంజ్‌లో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.
'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











