సుకుమార్‌కు బన్నీ, చెర్రీ, ర్యాండీ స్పెషల్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్ పిక్స్

టాలీవుడ్‌లో ప్రత్యేక శైలి ఉన్న నేటి తరం అతి కొద్ది మంది దర్శకుల్లో సుకుమార్ ఒకడు.. మొట్టమొదటి వాడు. ఏ సినిమా తీసినా దాంట్లో ఆయన శైలి స్పష్టంగా కనిపిస్తుంది. కమర్షియల్ ఫార్మాట్‌లో తీసినా సరే అందులోనూ తన మార్క్ ఉండేలా.. ఏదో ఒక ఎమోషన్‌ను పట్టుకుని అద్భుతంగా తెరకెక్కిస్తాడు. చివరగా తీసిన రంగస్థలం టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. నేడు సుకుమార్ పుట్టినరోజు ఈ సందర్భంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, రత్నవేలు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు.

ప్రేక్షకుడి స్థాయిని పెంచే డైరెక్టర్..

ప్రేక్షకుడి స్థాయిని పెంచే డైరెక్టర్..

తెలుగు ప్రేక్షకుడి స్థాయిని పెంచే డైరెక్టర్‌గా సుకుమార్‌ను అభివర్ణిస్తుంటారు. వన్ నేనొక్కడినే తీసినా, నాన్నకు ప్రేమతో తీసినా.. రంగస్థలం తీసినా అది కేవలం సుకుమార్‌కు మాత్రమే చెల్లింది. వన్ నేనొక్కడినే ఫ్లాప్ అయినా కూడా సుకుమార్ టేకింగ్‌కు, థాట్స్‌కు మంచి మార్కులే పడ్డాయి. హాలీవుడ్ స్థాయిని మరిపించేలా తెరకెక్కించిన ఆ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది.

రంగస్థలంతో హల్ చల్..

రంగస్థలంతో హల్ చల్..

వన్, నాన్నకు ప్రేమతో లాంటి ఇంటెలిజెన్స్‌తో కూడిన చిత్రాలు తీసిన సుకుమార్.. పూర్తిగా పంథా మార్చుకుని నేటివిటీకి దగ్గరగా ఉండే రంగస్థలం చిత్రాన్ని తెరకెక్కించాడు. సుకుమార్ లాంటి దర్శకుడి నుంచి ఇలాంటి ఓ మాస్, రియలిస్టిక్ సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లోనే కాకుండా.. టాలీవుడ్ హిస్టరీలో కూడా నిలిచిపోయేలా రికార్డులను బ్రేక్ చేసింది.

ప్రత్యేక విషెస్ చెప్పిన బన్నీ, చెర్రీ

ఇలా తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సుకుమార్‌కు రామ్ చరణ్ ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. రంగస్థలం నాటి విశేషాలను, అప్పటి ఫోటోలను షేర్ చేస్తూ.. బ్యూటీఫుల్ పర్సన్, అమేజింగ్ డైరెక్టర్, గొప్ప స్నేహితుడు సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలిపాడు. అదే విధంగా బన్నీ కూడా ఓ మేడ మీద తాపీగా ముచ్చట్లు పెడుతున్న ఫోటోను షేర్ చేసి నా సుక్కుకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రాసుకొచ్చాడు.

రంగస్థలం నాటి ఫోటోతో..

హీరో ఎవరైనా గానీ.. సుకుమార్ ప్రతి సినిమాకు రత్నవేలు కెమెరామెన్‌గా ఉండాల్సిందే. వీరిమధ్య బందం ఈనాటిది కాదు. ఆర్యతో మొదలైన వీరి ప్రయాణం నేటికి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. నేడు సుకుమార్ బర్త్ డే సందర్భంగా.. రంగస్థలం షూటింగ్ లొకేషన్లలోని ఓ ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు.

నీకు తెలియని ఫోటో..

నీకు తెలియని ఫోటో..

తెలుగు సినిమాలోని ఫైనెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ సుకుమార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీకు ఈ ఏడాదంతా శుభం కలగాలి. నీవు చూడనటు వంటి ఫోటో..నేను మూడేళ్ల క్రితం తీసిన ఫోటో.. అంటూ దేవీ శ్రీ ప్రసాద్‌ను కూడా ప్రస్థావించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X