జనసైనికులకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్.. బాబాయ్ బర్త్ డే స్పెషల్ అంటూ!
మెగా అభిమానులకు మరో పండుగ రోజు దగ్గరపడింది. ఇటీవలే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు పండగ రాగా.. సెప్టెంబర్ 2వ తేదీన తమ్ముడు పవర్ స్టార్ పుట్టిన రోజు పండగ వచ్చేస్తోంది. దీంతో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. పలు సామాజిక కార్యక్రమాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఓ సర్‌ప్రైజ్ ఇస్తూ మెగా అభిమాన వర్గాలను ఖుషీ చేశాడు. వివరాల్లోకి పోతే..

మెగా పండగ.. సెప్టెంబర్ 2
సెప్టెంబర్ 2 వ తేదీన జనసేనాని పవన్ కళ్యాణ్ 48వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్బంగా ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమై పవర్ స్టార్ బర్త్ డే గ్రాండ్‌గా చేసేందుకు సిద్ధమయ్యారు మెగా అభిమానులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరిపేలా సర్వం సిద్ధం చేస్తున్నారు.

జనసైనికులకు రామ్ చరణ్ కిక్
ఈ లోగా జనసైనికులకు కిక్కిచ్చేలా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా ఫ్యాన్స్ కోసం ‘పవన్ కళ్యాణ్ బర్త్ డే కామర్ డీపీ' పోస్టర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు రామ్ చరణ్. దీంతో ఖుషీ అయిన మెగా ఫ్యాన్స్ కొద్ది సేపట్లోనే దీన్ని వైరల్ చేసేశారు.
సెలైన్ సూదులతో జనసేనాని
ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ రెండు డిఫెరెంట్ యాంగిల్స్‌లో కనిపిస్తున్నారు. నవ్వుతూ, దీర్ఘ ఆలోచన చేస్తూ రెండు వేరియేషన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ పోస్టర్‌కు 'జనసేనాని' అనే టైటిల్‌ని ఇవ్వగా.. సెలైన్ సూదులతో ఉన్న పవన్ చేయి.. ఎన్ని కష్టాలొచ్చినా ఫ్యూచర్ మనదే, విజయం తధ్యం అన్నట్టుగా ఉంది.

మద్దతుగా ఉందాం..
ఇక ఈ కామన్ డీపీ పోస్ట్ చేసిన రామ్ చరణ్.. ''ప్రజల కోసం సరైన, మంచి పనులు చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏపీ వరద బాధితులను రక్షించే దిశగా ఆయన తీసుకుంటున్న చర్యలకు మనమంతా మద్దతుగా ఉందాం'' అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











