RC16 : అఫీషియల్‌గా ట్యాగ్ మార్చుకున్న రామ్ చరణ్... కొత్త పేరు ఇదే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉన్న హీరోల్లో టాప్ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు గుర్తొస్తాయి. అప్పటివరకు రెబల్ స్టార్‌గా ఉన్న ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారిపోయారు. ఇక ఆర్ఆర్ఆర్ బిగ్గెస్ట్ బ్లాక్ హిట్ అవ్వడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్ ట్యాగ్‌ను సంపాదించుకున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ తన ఇమేజ్ ట్యాగ్‌ను అఫీషియల్‌గా మార్చుకుని అనౌన్స్ చేశారు. మరి ఇంతకీ అదేంటి? దాని గురించి పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా స్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. మొదట్లో తనకు దొరికిన కథలు, దర్శకులతోనే హీరోగా పేరొందిన ఆయన ఆ తర్వాత ధృవ, రంగస్థలం సినిమాలతో తనలోని పూర్తి నటనను బయటపెట్టి స్టార్ స్టేటస్‌ను అందుకున్నారు. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయారు.

ఎందుకంటే అప్పటివరకు టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన ఆయన క్రేజ్ ఇండియాను దాటి హాలీవుడ్ స్ఠాయికి చేరుకుంది. అక్కడి దర్శకులు, నిర్మాణ సంస్థలు సైతం చరణ్‌పై ప్రశంసలు కురిపించాయి. దీంతో చరణ్‌ను అందరూ మెగా పవర్ స్టార్ అనడం మానేశారు. ఆయన స్థాయి, క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో భారీగా పెరగడంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చి ఆ పేరుతోనే పిలుస్తున్నారు.
రామ్‌చరణ్‌నే కాదు ఎన్టీఆర్‌ను కూడా యంగ్ టైగర్ అనడం మానేసి అఫీషియల్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ఇమేజ్ను తగిలించారు. రీసెంట్గా దేవర పోస్టర్‌పై అధికారికంగా కూడా ఈ పేరును ప్రచురించారు. అయితే చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. మొన్నటి వరకు కేవలం ప్రచారంలో ఉన్న ట్యాగ్ లైన్‌ను తీసుకొచ్చి ఇప్పుడు అఫీషియల్ చేశారు.
తాజాగా రిలీజైన ఆర్సీ 16 కొత్త పోస్టర్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంటూ రాసుకొచ్చారు. రీసెంట్గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడా వీడియోను మార్చి 23న ఉదయం 11 07 నిమిషాలకు రిలీజ్ చేస్తామంటూ తెలిపారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గ్రహీత సంగీతం సమకూరుస్తున్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. వెంకట సతీశ్ కిలారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అంటే మొత్తానికి RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ ఆన్ స్క్రీన్ ఇమేజ్ ట్యాగ్స్‌ను మార్చుకొని వస్తున్నారు. మరి ఆ ఇమేజ్ ట్యాగ్స్‌కు తగ్గట్టుగానే సినిమా ఫలితాలు కూడా వరల్డ్ లెవెల్లో గ్రాండ్‌గా వస్తాయో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











