పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ పై స్పందించిన రామ్ చరణ్.. కొన్ని పాయింట్స్ అనుకున్నాం అంటూ..

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తేజ్ 40 నిమిషాల నిడివి ఉన్న పాత్ర పాత్రతో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు. మొదటిసారి మెగా స్టార్ మెగా పవర్ స్టార్ కలయికలో వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. అయితే తండ్రితో నటించిన రామ్ చరణ్ తేజ్ బాబాయ్ తో కూడా నటించాలని అనుకుంటున్నట్లు ఇటీవల ఇచ్చిన తెలియజేశాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

చరణ్ తో సినిమా చేయాలని..

చరణ్ తో సినిమా చేయాలని..


భరత్ అనే నేను సినిమా తర్వాత దర్శకుడు కొరటాల శివ రామ్ చరణ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అప్పుడు రామ్ చరణ్ తేజ్ RRR సినిమాకు పూర్తి స్థాయిలో డేట్స్ ఇవ్వడంతో గ్యాప్ దొరకడం కష్టంగా మారింది. ఇక వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ చేయడంతో విభిన్నమైన కథను సిద్ధం చేసుకున్నా కొరటాల శివ సింగిల్ సిట్టింగ్ లోనే కథను చెప్పి మెగాస్టార్ ను ఒప్పించేశాడు.

పండగ వాతావరణం

పండగ వాతావరణం

ఇక ఆ కథను డెవలప్ చేసే క్రమంలో కొరటాల శివకు మరొక ముఖ్యమైన పాత్ర కోసం రామ్ చరణ్ అవసరం పడింది. కానీ అప్పటికే రామ్ చరణ్ RRR సినిమా మొదలు పెట్టేసాడు కాబట్టి అతని డేట్స్ దొరకడం కూడా చాలా కష్టంగా మారింది. ఇక వెంటనే రాజమౌళిని ఒప్పించి ఖాళీ సమయంలో షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. మెగా పవర్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి కలయికలో వస్తున్న మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది.

బాబాయ్, అబ్బాయ్ కాంబో..?

బాబాయ్, అబ్బాయ్ కాంబో..?

అయితే తండ్రి చిరంజీవి తో నటించిన రామ్ చరణ్ తేజ్ అలాగే బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కూడా నటిస్తే చూడాలని ఉన్నట్లు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలోనే వీరి కాంబినేషన్లో సినిమా రానున్నట్లు సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి పవన్ కూడా సినిమా చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వచ్చింది. కానీ ఆ కథ ముందుకు సాగలేదు.

పవన్ కళ్యాణ్ తో సినిమా..

పవన్ కళ్యాణ్ తో సినిమా..

ఇక ఇటీవల ఆచార్య సినిమా ప్రమోషన్ లో మీడియాతో మాట్లాడుతూ తప్పకుండా బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా సినిమా చేస్తాను అని చరణ్ అన్నాడు. ఇదివరకే కొన్ని కాన్సెప్ట్ పాయింట్స్ పై చర్చలు జరిపినట్లు చెబుతూ.. సరైన కథ కుదిరితే మాత్రం సొంత ప్రొడక్షన్ లోనే ఆ సినిమా తానే నిర్మిస్తానని కూడా రామ్ చరణ్ తేజ్ తెలియజేయడం విశేషం.

 రాబోయే ప్రాజెక్టులు

రాబోయే ప్రాజెక్టులు

ఇక రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 15వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయిందని అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా 16వ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు చరణ్ మొదటిసారి తెలియజేశాడు. ఇక ఆ సినిమా స్క్రిప్ట్ కూడా ఫైనల్ దశలో ఉంది అని త్వరలోనే మొదలవుతుంది అని రామ్ చరణ్ తేజ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X