హాలీవుడ్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్.. అప్డేట్ కూడా అప్పుడే అంటూ..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత ఒక్కసారిగా హాలీవుడ్ ప్రపంచంలో కూడా హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆ సినిమాలో రామ్ చరణ్ నటించిన విధానానికి హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఇక ఆ సినిమా అనంతరం రామ్ చరణ్ మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే భవిష్యత్తులో హాలీవుడ్ సినిమా కూడా చేయబోయే అవకాశం ఉన్నట్లుగా కూడా రామ్ చరణ్ వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇండియాలోనే కాకుండా

ఇండియాలోనే కాకుండా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన RRR సినిమా ఎలాంటి ఫలితం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా జపాన్లో కూడా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఓటీటీ లో విడుదలైన తర్వాత హాలీవుడ్ ప్రముఖ దర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

 ఆస్కార్ వేడుకలో RRR

ఆస్కార్ వేడుకలో RRR

RRR సినిమా ఇప్పుడు ఏకంగా ఆస్కార్ వేడుకల్లో కూడా హైలెట్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. తప్పకుండా అకాడమీ అవార్డును సొంతం చేసుకుంటుంది అని అందరూ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులందరూ అమెరికాకు వెళ్లిన విషయం తెలుస్తుంది.

రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలు

రామ్ చరణ్ వరుస ఇంటర్వ్యూలు

అయితే అందరికంటే ముందుగానే రామ్ చరణ్ తేజ్ అమెరికాకు వెళ్లి అక్కడ ఆస్కార్ వేడుకలో పాల్గొనే ముందు హాలీవుడ్ మీడియాకు కూడా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇప్పటికే ఇండియన్ సినిమాల గురించి అలాగే రాజమౌళి గొప్పతనం గురించి మాట్లాడిన రామ్ చరణ్ తేజ్ తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

భవిష్యత్తు ప్రాజెక్టులు

భవిష్యత్తు ప్రాజెక్టులు

రామ్ చరణ్ తేజ్ తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. అలాగే బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియాకు సినిమా కూడా చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్టు ఈ ఏడాది చివరలో పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. అలాగే రామ్ చరణ్ తేజ్ మరికొన్ని ప్రాజెక్టులను కూడా లైన్లో పెట్టే అవకాశం ఉంది

 మరో రెండు నెలల్లో హాలీవుడ్ ప్రాజెక్ట్

మరో రెండు నెలల్లో హాలీవుడ్ ప్రాజెక్ట్

ఇక రీసెంట్ గా టాక్ ఈజీ పాడ్ క్యాస్ట్ లో మాట్లాడిన రామ్ చరణ్ తేజ్ కొన్ని హాలీవుడ్ స్టూడియోలతో చర్చలు జరుగుతున్నాయి అని తప్పకుండా హాలీవుడ్ ప్రాజెక్టులకు సంబంధించి మరో రెండు నెలల్లో ఒక గుడ్ న్యూస్ ఉంటుంది అని కూడా రామ్ చరణ్ తేజ్ తెలియజేశాడు. అంటే తప్పకుండా రామ్ చరణ్ తేజ్ ప్రముఖ హాలీవుడ్ సంస్థలతో వర్క్ చేయబోతున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. మరి ఆ ప్రాజెక్టులు ఎలా ఉంటాయో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X