For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRRలో రాజమౌళి కుటుంబ పెత్తనం: ఎంత బ్రతిమాలినా ఒప్పుకోవట్లేదు, నాగ్‌తో బాధను చెప్పుకున్న రామ్ చరణ్!

  |

  ఇండియన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియన్ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొట్టమొదటిసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అయినటువంటి ఈ సినిమా తప్పకుండా టాలీవుడ్ స్థాయిని మరో లెవల్ కు తీసుకు వెళుతుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న కొద్దీ కూడా అభిమానుల ఓపికకు మరింత పరీక్ష పెడుతోంది.

  కరోనా కారణంగా గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల బిగ్ బాస్ షో లో కి ప్రత్యేక అతిథిగా వచ్చిన హీరో రామ్ చరణ్ తేజ్ డైరెక్టర్ రాజమౌళి గురించి అలాగే ఫ్యామిలీ గురించి కూడా ఎవరూ ఊహించని విధంగా వివరణ ఇచ్చాడు.

  Natraj Master భార్య నీతూ సీమంతం ఫోటోలు.. బుల్లితెర తారలే దిగివచ్చి!

  అప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది

  అప్పుడే ఒక క్లారిటీ వచ్చేసింది

  హిస్టారికల్ పాత్రలతో ఫిక్షనల్ కథగా వస్తున్న RRR సినిమా తప్పకుండా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని ఇదివరకే పోస్టర్స్ టీజర్స్ తో ఒక క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా విడుదలైన మొదటి పాట కూడా భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. చూస్తుంటే తప్పకుండా సినిమా పాన్ ఇండియన్ సినిమా మార్కెట్ స్థాయిని కూడా మరో లెవెల్ కి తీసుకు వెళ్లడం ఖాయమని అర్థమవుతోంది. ఈ సినిమాను 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

  Bigg Boss Telugu 5 లో రాంచరణ్.. మెగా తనయుడిని టార్గెట్ చేసిన ఆ ఇద్దరు.. తమన్నా, నభా నటేష్ రచ్చ

  ఆయన తప్పితే ఎవ్వరు చెప్పట్లేదు

  ఆయన తప్పితే ఎవ్వరు చెప్పట్లేదు

  ఇక సినిమా షూటింగ్ అయితే దాదాపు పూర్తి అయినట్లే. సినిమా ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకోవాలని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఎవరు కూడా ఇప్పటివరకు ఆ విషయంలో పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. కేవలం సినిమా రైటర్ విజయేంద్రప్రసాద్ మాత్రమే అప్పుడప్పుడు సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాలను పలు ఇంటర్వ్యూలలో తెలియజేస్తున్నారు.

  క్యారెక్టర్ ఆర్టిస్టులకు హెచ్చరికలు

  క్యారెక్టర్ ఆర్టిస్టులకు హెచ్చరికలు

  ఇక రాజమౌళి సినిమాలకు సంబంధించిన విషయాలు ఏవి కూడా లీక్ అవ్వకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే అందరికీ ప్రత్యేకంగా కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారట. కేవలం రాజమౌళి మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమా కోసం పని చేస్తూ ఉంటారు కాబట్టి ఆ విషయంలో అందరూ కూడా చాలా సీరియస్ గా ఉంటారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో RRR సినిమాలో నటించిన కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కొన్ని విషయాలను లీక్ చేస్తున్నట్లు తెలుసుకున్న రాజమౌళి ఫ్యామిలీ అందరికీ మరొకసారి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

  ఓపెన్ గా చెప్పేసిన రామ్ చరణ్

  ఓపెన్ గా చెప్పేసిన రామ్ చరణ్

  ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా కనిపిస్తున్న రామ్ చరణ్ తేజ్ శనివారం బిగ్ బాస్ షోలో కి ప్రత్యేకంగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అక్కడ RRR గురించి ఏమైనా చెబుతారేమో అని అనుకుంటే ఎవరూ ఊహించని విధంగా వివరణ ఇచ్చాడు. సాధారణంగా ఒక సినిమా తెరకెక్కుతోంది ఉంటే తప్పకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా హీరోలకు తెలుస్తుంది కానీ రామ్ చరణ్ కు ఒక్క విషయం కూడా తెలియదని చాలా ఓపెన్ గా చెప్పేశాడు.

  నాకు కూడా అదే సందేహం..

  నాకు కూడా అదే సందేహం..

  బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున RRR సినిమాకు సంబంధించిన విషయాలను లాగేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు కానీ రామ్ చరణ్ చెప్పిన విషయాలకు ఆయన కూడా ఒక్కసారిగా షాకయ్యారు. RRR సినిమా ఎలా వస్తుందా అని మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఆ విషయాన్ని మాకు చెప్పవా అని అడగ్గానే అందుకు రామ్చరణ్ కూడా నాకు కూడా అదే సందేహం అంటూ ఊహించని విధంగా సమాధానం ఇచ్చాడు.

  ఈ అన్యాయం ఏమిటండి?

  ఈ అన్యాయం ఏమిటండి?

  రామ్ చరణ్ మాట్లాడుతూ.. నేను రోజు డబ్బింగ్ చెబుతున్నాను. అంతేకాకుండా షూట్ చేసిన సాంగ్స్ కు సంబంధించిన స్షాట్స్ ఎలా వస్తున్నాయో అని రాజమౌళి తనయుడు కార్తికేయ ను అలాగే కీరవాణి సతీమణి వల్లి గారిని ప్రతిరోజు అడుగుతున్నాను. ఇప్పటి వరకు కనీసం ఆ పాటలకు సంబంధించిన షార్ట్ ను కూడా మాకు చూపించలేదు.. అని చెప్పడంతో నాగార్జున కాస్త నవ్వుతూనే రాజమౌళి గారు ఈ అన్యాయం ఏమిటండి అంటూ.. ఆయనకు చూపించకపోయినా కనీసం నాకు అయినా చూపించండి అంటూ కెమెరా ముందు చూసి అడిగారు.

  Bigg Boss Telugu 5: Sriram Chandra - Hamida హాట్‌ హాగ్స్‌.. రొమాంటిక్ డ్యాన్సు || Oneindia Telugu
  లీక్ అవ్వకుండా ఉండాలని..

  లీక్ అవ్వకుండా ఉండాలని..

  ఇక ఈ సినిమాకు రాజమౌళి ఫ్యామిలీ సభ్యులు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి పనిలో వారి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా రాజమౌళి తనయుడు కార్తికేయ ఉంటున్నట్లు తెలుస్తోంది. డబ్బింగ్ నుంచి రీ రికార్డింగ్ వరకు అన్ని పనుల్లోనూ అతను జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇక లైన్ ప్రొడ్యూసర్ గా కీరవాణి భార్య వల్లి గారు వర్క్ చేస్తూ వస్తున్నారు. సినిమా ఎక్కడా కూడా లీక్ కాకుండా వారు హీరోలకు కూడా అస్సలు ఒక్క సీన్ కూడా చూపించడం లేదట. ఆ రేంజ్ లో ఆలోచిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటున్నారు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

  English summary
  Ram charan tej shocking comments on RRR team
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X