HBD Chiranjeevi: తండ్రికి రామ్ చరణ్ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఆచార్యతో ఎమోషనల్ జర్నీ.. వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి నేడు 66 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సినీ తారలు కూడా మెగాస్టార్ పై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా చూపిస్తున్నారు. మెగాస్టార్ తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ అభిమానుల మనసుకు మరింత మరింత దగ్గరవుతారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా తన తండ్రికి ప్రత్యేకమైన వీడియో తో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఈ స్టార్ హీరోని ఇద్దరూ కూడా మొదటి సారి ఆచార్య సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

 తండ్రికి తగ్గ తనయుడిగా

తండ్రికి తగ్గ తనయుడిగా

ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ చిరంజీవి కోట్లాది అభిమానుల ప్రేమను సంపాదించుకొని అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. తోటి నటీనటులతో కూడా ఆయన ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ అభిమానుల్లో కూడా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇక అదే బాటలో తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా వెళుతున్నాడు. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకొని తండ్రికి తగ్గ తనయుడిగా ఒక గౌరవం తీసుకువస్తున్నాడు.

నేను అప్పా అని పిలువబడే ఆచార్య..


ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న యువ హీరోలు, అగ్రహీరోలు అందరూ కూడా మెగాస్టార్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ తేజ్ కూడా తన తండ్రికి ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ వీడియోతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నేను అప్పా అని పిలువబడే ఆచార్యతో మర్చిపోలేని మూమెంట్స్ ఇవే.. అంటూ మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందించాడు.

ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశాను

ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేశాను

ఆ వీడియో లో రామ్ చరణ్ తేజ్ తన తండ్రిని కారులో తీసుకు వెళుతూ కనిపిస్తున్నాడు. అంతేకాకుండా షూటింగ్ స్పాట్ లో కొడుకుని చూస్తూ మెగాస్టార్ ఎంతో ఆప్యాయంగా కనిపించారు. ఇద్దరి మధ్యలో అలాంటి వాతావరణాన్ని చూసిన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. షూటింగ్ లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు కనిపించింది ఆయనతో ప్రతి మూమెంట్ కూడా ఎంజాయ్ చేశాను అని రామ్ చరణ్ తేజ్ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

Recommended Video

Hero Suhas About Writer Padmabhushan Movie
 ఆచార్య విడుదల ఎప్పుడంటే?

ఆచార్య విడుదల ఎప్పుడంటే?

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ చేస్తున్న సిద్దా అనే పాత్ర సినిమాకు ప్లస్ పాయింట్ అని ఇదివరకే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ముఖ్యంగా సెకండాఫ్ లో చరణ్, చిరు మధ్య వచ్చే యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చిరంజీవి కూడా పలుమార్లు తెలియజేశారు. ఇక ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్స్ టికెట్ల పై తీసుకునే కొత్త నిర్ణయంపై ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ ఆధారపడి ఉంది. కుదరకపోతే వచ్చే ఏడాది సంక్రాంతి లేదా ఆ తరువాత రావచ్చని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X