‘ఆచార్య’ కోసం చరణ్ అలా ప్లాన్ చేస్తున్నాడట.. అప్పటి నుంచే షూటింగ్
టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. చాలా కాలంగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న అతడు.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ప్రస్తుతం అతడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRRలో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అతడు.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ చేసే ప్రాజెక్టులపై ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చినప్పటికీ క్లారిటీ మాత్రం రావడం లేదు.
RRR కాకుండా రామ్ చరణ్ తన తండ్రి నటిస్తున్న 'ఆచార్య'లో కీలక పాత్రను పోషిస్తున్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో దాదాపు ముప్పై నిమిషాల పాటు ఉండే ఆయన పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలవనుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, చరణ్ పోషించే పాత్ర చిరంజీవికి గురువులా ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అతడికి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తుందని అంటున్నారు. ఈ సినిమా కోసం జనవరి నుంచి డేట్స్ కేటాయించాడట మెగా పవర్ స్టార్.

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో చిరంజీవిపై ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత జనవరిలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుందట. అందులో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన భాగాన్ని షూట్ చేస్తారని అంటున్నారు. అందులోనే కియారా సీన్స్ కూడా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











