పెళ్లిరోజున రామ్ చరణ్-ఉపాసన సర్‌ప్రైజ్.. మెగా వారసులపై అన్నా లెజినోవా రియాక్షన్ వైరల్!

టాలీవుడ్‌లోనే అత్యంత అభిమానాన్ని సొంతం చేసుకున్న సెలబ్రిటీ జంటల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana) ఒకరు. వీరి వివాహం 2012 జూన్ 14న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రేమ, పరస్పర గౌరవం, కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ జంట ఎన్నో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఆదివారం (నేడు) ఈ దంపతులు తమ 14వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. సాధారణంగా తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చాలా వరకు గోప్యంగా ఉంచే ఈ జంట.. ఈసారి మాత్రం అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. తాజాగా పెళ్లిరోజు సందర్భంగా ఉపాసన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ మెగా కోడలు సర్రైజ్ ఏంటీ?

స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్బంగా తమ ముద్దుల కవల పిల్లలైన శివరామ్ కొణిదెల(Shivram Konidela), అన్వీరా దేవి కొణిదెల(Anveera Devi Konidela) లకు సంబంధించిన మొదటి అందమైన గ్లింప్స్‌ను వారు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హార్ట్ ఈజ్ ఫుల్' (మనసు నిండిపోయింది) అంటూ ఉపాసన షేర్ చేసిన ఈ ఫోటో చూసిన మెగా అభిమానులు, నెటిజన్లు ఈ సర్‌ప్రైజ్‌కు ఫిదా అవుతున్నారు. అంతేకాదు.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Ram Charan-Upasana Anniversary Surprise Twins First Glimpse and Anna Lezhneva s Viral Reaction

ఉపాసన షేర్ చేసిన ఫోటోలో ముగ్గురు చిన్నారుల చేతులు ఒకదానిపై ఒకటి ఉంచిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పెద్ద కుమార్తె క్లీంకార చేయితో పాటు కవలలైన శివరామ్, అన్వీరా దేవి చిన్న చిన్న చేతులు కనిపించేలా ఎంతో అందంగా ఈ ఫోటోను క్లిక్ చేశారు. ఈ ఫోటోకు ఉపాసన హార్ట్ పుల్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో ఆమె తల్లిగా అనుభవిస్తున్న ఆనందం ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 2023లో క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 31న వారికి కవలలు జన్మించారు. ఒక బాబుకు 'శివరామ్ కొణిదెల', ఒక పాపకు 'అన్వీరా దేవి కొణిదెల' అని పేర్లు పెట్టారు.

అయితే ఇప్పటి వరకు ఈ చిన్నారుల ఫోటోలను పూర్తిగా బయటకు రానివ్వలేదు. అందుకే ఈ తాజా గ్లింప్స్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ అయింది. వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు ఈ జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. "హ్యాపీ యానివర్సరీ చరణ్-ఉపాసన", "మెగా కుటుంబానికి శుభాకాంక్షలు", "చాలా క్యూట్ పిక్" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ పోస్టుకు వచ్చిన స్పందనల్లో ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా రియాక్షన్. ఆమె ఈ పోస్టుకు రెడ్ హార్ట్ ఎమోజీలతో స్పందించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధానికి ఇది మరో నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మెగా అభిమానులు ఈ ఫోటోను మెగా లెగసీకి ప్రతీకగా అభివర్ణిస్తున్నారు. కొందరు అభిమానులు ఈ ఫోటోను ఎడిట్ చేసి ప్రత్యేక పోస్టర్లు కూడా రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మరోవైపు రామ్ చరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.378 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి చరణ్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఒకవైపు కెరీర్‌లో సక్సెస్, మరోవైపు కుటుంబ జీవితంలో ఆనంద క్షణాలు కలిసి రావడంతో ఈ ఏడాది వివాహ వార్షికోత్సవం చరణ్-ఉపాసనలకు జీవితాంతం గుర్తుండిపోయే ప్రత్యేక సందర్భంగా మారిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ క్యూట్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X