Mega Princess: ప్రెగ్నెన్సీ కోసం అలాంటి విధానం.. ఉపాసన కామెంట్స్ వైరల్
ప్రస్తుతం మెగా చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. మెగా ఫ్యామిలీ, కామినేని కుటుంబ సభ్యులతోపాటు మెగా అభిమానుల్లో సంతోషం వెల్లువిరుస్తోంది. అందుకు కారణం రామ్ చరణ్-ఉపాసన కొణిదెల మెగా ప్రిన్సెస్ కు జన్మనివ్వడమే. ఈ దంపతులకు సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు విషెస్ తెలియజేస్తున్నారు. అయితే రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డ కోసం కుటుంబీకులు, అభిమానులు ఎంతగా ఎదురుచూశారో తెలిసిందే. ఉపాసన ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఉత్సాహం వచ్చింది. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో ప్రెగ్నెన్సీ, పిల్లల గురించి ఉపాసన మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీలు విషెస్:మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి పండంటి ఆడబిడ్డకు జూన్ 20న అంటే ఇవాళ జన్మనిచ్చింది. దీంతో చెర్రీ, ఉపాసన ఇళ్లల్లో సంబురాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మెగా ప్రిన్సెన్స్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అంతేకాకుండా రామ్ చరణ్-ఉపాసన దంపతులకు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అధికారిక ప్రకటన:మెగా వారసురాలిని చూసేందుకు అల్లు అర్జున్ తోపాటు మిగతా బంధువులు అపోలో ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇదిలా ఉంటే స్నేహితులైన రామ్ చరణ్-ఉపాసన దంపతులు 2012లో వివాహం చేసుకున్నారు. పెళ్లి పదేళ్లయిన తర్వాత వారు తల్లిదండ్రులు కాబోతున్నారు అని చిరంజీవి అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం వచ్చింది.

ఎగ్స్ ఫ్రీజింగ్:దశాబ్దం తర్వాతే పిల్లలను ఎందుకు కనాలనుకున్నారో ఉపాసన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందే ఉపాసన, రామ్ చరణ్ మంచి స్నేహితులు. అందుకే పిల్లలను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలనే విషయంలో వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు అందులో చెప్పుకొచ్చారు. తమ పెళ్లి ప్రారంభంలోనే ఎగ్స్ ఫ్రీజ్ చేసే పద్ధతి ఉపయోగించినట్లు ఉపాసన తెలిపారు.

మంచి భవిష్యత్తు:ఈ ఇంటర్వ్యూలో "చరణ్ నేనుమా వివాహబంధంలో ప్రెగ్నెన్సీ కోసం ఎగ్స్ నిల్వ చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆ సమయంలో మా కెరీర్ పై దృష్టి పెట్టాలని మేము భావించాం. జీవితంలో సరైన సంపాదన తర్వాతే పిల్లలను కనాలని అనుకున్నాం. ఈరోజు మేము ఇద్దరం మంచి స్థానంలో ఉన్నాం. ఈరోజు మా సంపాదనతో పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలమనే నమ్మకం ఉంది" అని ఉపాసన పేర్కొన్నారు.

ప్రియాంక చోప్రా కూడా:కాగా ఉపాసన లాగే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తన ఎగ్స్ ను నిల్వ చేసింది. క్వాంటికో టీవీ సిరీస్ లో నటిస్తున్నప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసే పద్థతి ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు ప్రియాంక తెలిపింది. ఆమె తల్లి మధు చోప్రా, వైద్యుల సలహాతో అలా నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. జనవరి 2022లో మాల్టీ మేరి చోప్రా జోనాస్ కు సరోగసీ ద్వారా జన్మనిచ్చారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్-ప్రియాంక చోప్రా జంజీర్ తెలుగులో తుఫాన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











