Happy Birthday Klin Kaara : క్లింకార పేరుపైన పులి.. ఎక్కడి జూలో ఉందో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల దంపతుల కూతురు క్లింకార పుట్టిన రోజు కావడం విశేషం. జూన్ 20, 2023న క్లింకార పుట్టిన సంగతి తెలిసిందే. క్లింకార రెండో పుట్టిన రోజు వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. మెగా అభిమానులు చిన్నారి క్లింకారకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇక క్లింకారకు సంబంధించిన క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో తల్లి కొణిదెల ఉపాసన తన కూతురుతో హైదరాబాద్ జూలో దర్శనమిచ్చింది. ఒక క్యూట్ రేర్ ఫొటోను పంచుకుంటూ మెగా అభిమానులకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది.
క్లింకార పేరు వెనకాల దాగి ఉన్న రహస్యం...
మెగా ప్రిన్సెస్ క్లింకార రెండేళ్ల కింద పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఎంతో సంతోషించారు. చిన్నారి పుట్టిన రోజు పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించారు. మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలిని అమ్మవారితో పోల్చుతూ తమ ఇంటిలోకి అమ్మవారు వచ్చిందంటూ మురిసిపోయారు. అందుకే చిన్నారికి 'క్లింకార' అని నామకరణం చేశారు. ఈ పేరు వెనకాల కూడా పెద్ద అర్థం దాగి ఉంది. క్లింకార అనేది తెలుగులో ఒక పేరు. లలితా సహస్త్రనాయాల్లో ఒకటి. ఈ పదానికి అర్థం స్వరూపం, మాతృశక్తి, దైవిక రూపం అని అమ్మవారిని సూచించేలా ఉండటం విశేషం. అమ్మవారి దీవెనలు ఎప్పుడూ క్లింకారకు ఉండాలని ఆ పేరును పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇక క్లింకార పుట్టిన రోజు చిన్నారికి మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ ను అభిమానులు ఇచ్చారు.

ఆడ పులి పిల్లకు క్లింకార పేరు..
జూన్ 20న క్లింకార 2వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా క్లింకారకు సంబంధించిన ఒక అరుదైన ఫొటోలను పంచుకుంటూ ఎవ్వరికీ తెలియని రహస్యాన్ని చెప్పుకొచ్చింది ఉపాసన. తన కూతురుతో పాటు జూలో చిన్న పులి పిల్ల దగ్గర దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. క్లింకార పుట్టిన తర్వాత ఏడాదికి జూలో సురక్షితంగా పెరుగుతున్న పులి పిల్లకు క్లీంకార అని నామకరణం చేశారని చెప్పింది. తాజాగా ఆ పులి పిల్లను కలిసిన ఫొటోను షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే ఫొటోలో ఉపాసన కొణిదెల, క్లింకార మాత్రమే ఉన్నారు.
కొణిదెల వంశస్థురాలి గౌరవార్థం..
క్లింకార పేరు పెట్టిన ఆడపులి పిల్ల హైదరాబాద్ జూలో పెరుగుతోంది. కొణిదెల వంశస్థురాలి గౌరవార్థం హైదరాబాద్ జూ అధికారులు ఒక ఆడపులికి 'క్లిన్ కారా' అని పేరు పెట్టడం విశేషం. ఇక ఇవ్వాళ క్లింకార 2వ పుట్టిన రోజు కావడంతో ఆ ఆడపులి పిల్లను కలిసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల ఆ ఆడపులి పిల్లను దత్తత తీసుకున్నారు. జూ అధికారుల సహకారంతో ఆ పులి పిల్లను పోషిస్తున్నారు. గతేడాది ఆ పులి పిల్లను దత్తత తీసుకున్నారు. ఇప్పటికీ సరిగ్గా ఏడాది అవుతోంది.
క్లింకార రాకతో అన్నీ శుభాలే..
మెగా కుటుంబంలో క్లింకార జన్మించినప్పటి నుంచి అన్నీ శుభ శకునాలే జరిగాయి. మెగాస్టార్ కు పద్మవిభూషణ్ రావడం, వరుణ్ తేజ్ వివాహం, యూకే పార్లమెంట్ లో చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం, రామ్ చరణ్ కు మరింత పేరు దక్కడం వంటి మంచి విషయాలు జరిగాయి. ఇకపోతే రామ్ చరణ్ చివరిగా గేమ్ ఛేంజర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'పెద్ది' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ లండన్ లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











