గాండ్రిస్తూ పులి వచ్చేస్తుంది.. మీరే రక్షించుకోండి.. రాంచరణ్ హెచ్చరికపై ఎన్టీఆర్ ఝలక్
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR చిత్రం శరవేగంగా షూటింగు జరుపుకొంటున్నది. లాక్‌డౌన్ తర్వాత మళ్లీ షూటింగును ప్రారంభించి మూవీని రిలీజ్‌కు సిద్ధం చేసే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంది. అయితే సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అంటూ ఎందరు చూస్తున్న ప్రేక్షకులకు రాజమౌళి టీమ్ మరో సర్‌ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో రాంచరణ్ చేసిన ట్వీట్‌కు ఎన్టీఆర్ సమాధానం ఏమిటంటే..

లాక్‌డౌన్‌కు ముందు రాంచరణ్ కోసం..
లాక్‌డౌన్‌కు ముందు దర్శకుడు రాజమౌళి బర్త్ డే రోజున విడుదల చేసిన RRR ఫస్ట్ లుక్‌కు, రాంచరణ్ జన్మదినం రోజున ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసిన రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర ఫస్ట్‌లుక్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ రెండు లుక్స్ RRR సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది.

ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు విఫలం
లాక్‌డౌన్ సమయంలో ఎన్టీఆర్ బర్త్ డే రోజున రాంచరణ్ కూడా కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను యంగ్ టైగర్‌కు కానుకగా అందించాలని భావించాడు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో యంగ్ టైగర్ బర్త్ డే టీజర్ రిలీజ్ కావడం సాధ్య పడలేదు. ఈ క్రమంలో దసరా పండుగ కానుకగా అక్టోబర్ 22 తేదీన టీజర్ రిలీజ్‌కు సిద్ధమయ్యారు.

పులి వస్తున్నది.. జాగ్రత్త
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం టీజర్ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో రాంచరణ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రేపు పులి వస్తున్నది. మీకు మీరే రక్షణ కల్పించుకోండి. #RamarajuForBheemTomorrow అనే హ్యాష్ ట్యాగ్‌తో రాంచరణ్ ట్వీట్ చేశాడు.

బ్రదర్.. మీలా కాకుండా సమయానికే
ఇక అంతటితో రాంచరణ్ ఆగకుండా ఎన్టీఆర్‌పై సెటైర్ వేశాడు. బ్రదర్.. మిమ్మల్ని టీజ్ చేయడానికి ఏదో ప్రయత్నిస్తున్నాను. మీ మాదిరిగా కాకుండా.. చెప్పిన సమయానికి.. అనుకొన్న ముహుర్తానికి టీజర్‌ను మీ ముందుకు తీసుకువస్తాను అంటూ రాంచరణ్ మరో ట్వీట్ చేశాడు.
Recommended Video

ఇప్పటికే 5 నెలలు ఆలస్యం.. జక్కన్నతో జాగ్రత్త
రాంచరణ్ తనను ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై ఎన్టీఆర్ తనదైన శైలిలో స్పందించాడు. బ్రదర్ రాంచరణ్.. మీరు ఇప్పటికే 5 నెలలు ఆలస్యం అనే విషయం మీకు అర్ధమై ఉంటుంది. ఇక మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం మరోటి ఇక్కడ ఉంది. మీరు జక్కనతో డీల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఊహించిన దానికి భిన్నంగా ఏదైనా జరుగవచ్చు. ఏది ఏమైనా.. మీరు ఇచ్చే ఎక్సైట్‌మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను అని ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











