ముంబైకి రామ్ చరణ్.. ఎప్పుడూ లేని విధంగా చరణ్ వెంట శ్రీజ.. అందుకేనంటూ ప్రచారం!
చాలా గ్యాప్ తర్వాత రామ్ చరణ్ ముంబై విమానాశ్రయంలో కనిపించాడు. రాజమౌళి మరియు ఎన్టీఆర్‌లతో కలిసి RRR ప్రమోషన్ చేస్తున్నప్పుడు చరణ్ చివరిగా ముంబైలో కనిపించాడు. కానీ ఇప్పుడు చరణ్‌తో పాటు, ఆశ్చర్యకరంగా ఆయన చెల్లెలు శ్రీజ మరియు అతని పెంపుడు కుక్క రైమ్ కూడా ముంబైలో కనిపించారు. సాధారణంగా తన పని కోసం ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లే రామ్ చరణ్ ఈ సారి తన సోదరి శ్రీజతో కనిపించడం అరుదైన దృశ్యంగా చెప్పవచ్చు. శ్రీజ విడాకుల వార్తలు వైరల్ అయిన క్రమంలో ఇప్పుడు ఆమె రామ్ చరణ్ వెంట కనపడడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాల్లోకి వెళి..

చిరు అల్లుడిగా
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. 2016లో కళ్యాణ్ దేవ్, శ్రీజ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో వివాహమే కాగా వీరికి నవిష్క అనే పాప కూడా జన్మించింది. ఇక చిరు అల్లుడిగా కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ హీరోగా కూడా మారాడు.

విభేదాలు నెలకొన్నాయని
మొదటి సినిమా విజేతతో హిట్ అందుకున్న ఆయన రెండో సినిమా చెయ్యడానికి చాలా సమయం పట్టింది. ఆయన నటించిన రెండో సినిమా సూపర్ మచ్చి అంతగా ఆకట్టుకోలేదు. అయితే గత కొన్ని నెలల నుంచి శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమన్నాయి. శ్రీజ, కళ్యాణ్ దేవ్ కి విడాకులు కూడా ఐపోయినట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ సహా గెట్ టు గెదర్ లలో కళ్యాణ్ దేవ్ ఎక్కడా కనిపించలేదు.

ప్రచారానికి ఊతం
ఇక సంక్రాంతికి విడుదలైన కళ్యాణ్ దేవ్ సినిమా సూపర్ మచ్చికి సైతం మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. దీంతో ఈ జంట ఎప్పుడో విడిపోయినట్లు జరుగుతున్న ప్రచారానికి ఊతం ఇచ్చినట్టు అయింది. దానికి తోడు శ్రీజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ గతంలో ఉన్న శ్రీజ కళ్యాణ్ నుంచి కళ్యాణ్ అనే పేరు మార్చింది. కళ్యాణ్ పేరును తొలగించి తండ్రి ఇంటి పేరు కొణిదెల యాడ్ చేసి శ్రీజ కొణిదెలగా మార్చింది.

స్పెషల్ కేర్ తీసుకునేందుకు
దీంతో వీరి విడాకులు కన్ఫర్మ్ అయినట్లు మరింత ప్రచారం మొదలయింది. శ్రీజకు కళ్యాణ్ దేవ్ రెండవ భర్త.. 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ ఆయనతో 2014 లో విడాకులు తీసుకొని విడిపోయింది. అయితే ఈ విడాకుల వార్తల నేపథ్యంలో శ్రీజ వ్యక్తిగతంగా చాలా డిప్రెషన్ లో ఉంది. ఈ విషయంలో మెగా కుటుంబం మౌనం వహిస్తుండగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో రామ్ చరణ్ తన సోదరి పట్ల స్పెషల్ కేర్ తీసుకునేందుకు తనతోనే ఆమెను తీసుకు వెళ్లినట్టు చెబుతున్నారు.
Recommended Video

బాధాకరమైన లుక్‌లో
శ్రీజ ఒత్తిడిని తగ్గించి, ఆమెను ఏదో ఒక పనిలో బిజీగా ఉంచడానికి, రామ్ చరణ్ తన సోదరిని తనతో పాటు తీసుకువెళ్లాడు, తద్వారా కొత్త ప్రదేశానికి తీసుకు వెళితే ఆమెకు కొంత ప్రశాంతత లభిస్తుందని ఆయన భావిస్తున్నాడట. ఇక వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ ఫోటోగ్రాఫర్‌లకు సంతోషంగా కనిపిస్తూ ఉండగా శ్రీజ బాధాకరమైన లుక్‌లో కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











