సంతాన సమస్యపై ప్రశ్నించిన ఉపాసన.. అద్భుతమైన జవాబిచ్చిన ప్రముఖ వ్యక్తి!

టాలీవుడ్ బెస్ట్ సెలబ్రిటీ కపుల్స్ లో అందరిని ఎక్కువగా కట్టుకునే వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కూడా టాప్ లిస్టులో ఉంటారు అని చెప్పవచ్చు. ఇద్దరు కలిసి ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో చాలా తొందరగానే వైరల్ అవుతూ ఉంటాయి. ఇక వీరి పెళ్లి జరిగి 10 ఏళ్ళు కావస్తోంది. రామ్ చరణ్ తేజ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అలాగే ఉపాసన అపోలోకు సంబంధించిన వ్యవహారాలలో ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు తీరిక సమయాల్లో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల ఉపాసన పిల్లల్ని కనే విషయంపై తనకు ఎదురవుతున్న ఒక ప్రశ్నపై కూడా ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువును అడిగారు. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి మెగా కోడలిగా..

మంచి మెగా కోడలిగా..

ఉపాసన కొణిదెలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సతీమణిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నారు అనే చెప్పాలి. అపోలో యాజమాన్యంలో ఒక కీలక సభ్యురాలుగా కొనసాగుతున్న ఆమె ఎన్నో సామాజిక అంశాల్లో కూడా తనదైన శైలిలో సహాయక సహకారాలను అందిస్తున్నాడు. కరోనా సమయంలో కూడా ఆమె చాలామంది పేదలకు వైద్య సహకారం కూడా అందించడంలో కీలక పాత్ర పోషించారు.

 రామ్ చరణ్ తో అలా..

రామ్ చరణ్ తో అలా..

ఉపాసన కొణిదెల కేవలం నేషనల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా ఎకనామికల్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటారు. ఒకవైపు మెగా కోడలిగా బాధ్యతగా కొనసాగుతూనే మరొకవైపు అపోలో సంబంధించిన కార్యక్రమాలతో ఆమె బిజీగా కనిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు రాంచరణ్ తో కూడా ప్రత్యేకంగా టైమ్ స్పెండ్ చేస్తూ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

 సంతానంపై ఉపాసన ప్రశ్న

సంతానంపై ఉపాసన ప్రశ్న

అయితే ఉపాసన రామ్ చరణ్ పెళ్లి జరిగి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. అయితే ఇన్నేళ్లు వారు పిల్లల్ని ఎందుకు కనలేదు అనేది వారి వ్యక్తిగత విషయమైనప్పటికీ కూడా వాటిపై సోషల్ మీడియాలో నిత్యం చర్చ కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఉపాసన కూడా ఈ ప్రశ్న తరచుగా ఎదురవుతోందట. ఇక రీసెంట్ గానే ఆధ్యాత్మిక గురువు సద్గురు నిర్వహించిన ఒక ఈవెంట్లో పిల్లలను కనడం గురించి ఒక సందేహం కూడా వివరించారు.

దాని గురించే చర్చించుకుంటున్నారు

దాని గురించే చర్చించుకుంటున్నారు

ఉపాసన మాట్లాడుతూ నా దాంపత్య జీవితం అనేది ఎంతో సంతోషంగా ఉంది. మేము పెళ్లి చేసుకుని పదేళ్లవుతోంది. నా ఫ్యామిలీని నా లైఫ్ లో కూడా చాలా హ్యాపీగా ప్రేమిస్తున్నాను. కానీ ప్రజలు మాత్రం నా జీవితం లోని RRR గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. అందులో మొదటి R నా 'రిలేషన్షిప్' గురించి ఇక రెండవ R రీప్రొడ్యూసింగ్ (పిల్లల్ని కనడం) మూడవ R లైఫ్ లో నా రోల్.. వీటి గురించే ఎక్కువగా చెప్పుకుంటున్నారు అని ఉపాసన సద్గురును సందేహాలు అడిగారు.

పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు

పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు

ఇక సద్గురు ఈ విధంగా స్పందించారు. రిలేషన్షిప్ అనేది మీ వ్యక్తిగత విషయం. అందులో ఎవరికి కూడా చర్చించే అవకాశం లేదు. ఇక రెండవది రీప్రొడ్యూస్. పిల్లలను కనకుండా ఉంటున్న వారికి నేను కొన్ని అవార్డులు కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం చాలామంది జనాలు పెరిగిపోతున్నారు. జన సంఖ్య ఎక్కువైంది కాబట్టి పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఆడ పులి అయితే మాత్రం కచ్చితంగా పిల్లల్ని కనమని చెబుతాను. ఎందుకంటే వాటి సంఖ్య ఇప్పుడు తక్కువగా ఉంది.. అని సద్గురు చాలా వివరంగా తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X